జాతీయ వార్తలు

ఏరోస్పేస్, రక్షణ రంగానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ఏరో స్పేస్, రక్షణ రంగాలకు సంబంధించి తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. గురువారం వింగ్స్ ఇండియా-2020 సన్నాహక సమావేశంలో ప్రసంగించిన ఆయన తెలంగాణకు ఏయిరో స్పేస్, రక్షణ రంగాలు ప్రాధాన్యతా రంగాలని ప్రకటించారు. ఫ్లయింగ్ ఫర్ ఆల్ నినాదం స్ఫూర్తి మేరకు తెలంగాణలో ఏయిరో స్పేస్ రంగానికి మరిన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగుడెం, జక్రాన్ పల్లి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ తదితర ఏయిర్ పోర్టులు, పలు చోట్ల హెలీ పోర్టుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని రామారావు ప్రకటించారు. తెలంగాణలోకి గత ఐదున్నర సంవత్సరాల్లో ఏయిరో స్పేస్,రక్షణ రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని
తెలిపారు. ఈ రంగాల్లో శిక్షణా కార్యక్రమాలకు తమ ప్రభుత్వం అత్యిధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ రంగాలలోని కంపెనీలతో స్టార్ట్ అప్స్ పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. వింగ్స్ ఇండియా 2020తో పాటు గ్లోబల్ ఏవియేన్ సమ్మిట్ సదస్సును హైదరాబాదులో నిర్వహిస్తున్నందుకు ఆయన కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురికి ధన్యవాదాలు తెలిపారు. ఏయిరో స్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్‌లో ప్రపంచ స్థాయి కంపెనీలయిన బోయింగ్, జి.ఈ, సఫ్రాన్, రాఫెల్, లాక్ హీడ్ మార్టిన్ వంటి సంస్థలు తెలంగాణకు వచ్చాయని రామారావు తెలిపారు. దీనితో పాటు స్థానికంగా దాదాపు వెయ్యి ఏయిరో స్పేస్, రక్షణ సంస్థలు ఎంఎస్‌ఎం ఈ రంగల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో నాలుగు ఏయిరో స్పేస్ పార్కులు, అనేక ఎలక్ట్రానిక్ ఉత్పాదక క్లస్టర్లు ఉన్నాయన్నారు. అలాగే హార్డ్‌వేర్ పార్కులు,టెక్నాలజీ సెస్సులు ఉన్నాయని ఆయన వివరించారు. ఇన్నోవేషన్ రంగంలో టిహబ్, విహబ్ ఉన్నాయన్నారు. త్వరలో ప్రారంభం కానున్న టి వర్క్స్ ద్వారా ఏయిరో స్పేస్, రక్షణ రంగంలో వినూత్నమైన ఆలోచనలు ముందుకు వచ్చే అవకాశాలున్నాయని రామారావు చెప్పారు. ఇప్పటికీ టి హబ్ బోయింగ్ ప్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఏయిరో స్పేస్ స్టార్ట్ అప్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. దేశంలోకి తొలిసారిగా డ్రోన్ పాలసీ తీసుకువచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఏయిరో స్పేస్ రంగానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందనీ, ఏటియఫ్ పైన పన్ను 16 శాతం నుండి ఒక శాతానికి తగ్గించిందన్నారు. హెలీ పోర్టుల ద్వారా తెలంగాణలో దేవాలయాల పర్యటన అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామన్నారు. హెలీ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు, ఆర్థిక సహాయం చేయాలని రామారావు విజ్ఞప్తి చేశారు.
రామరావు సమావేశానంతరం ఏయిరోస్పేస్, రక్షణ కంపెనీల అధినేతలతో చర్చలు జరిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏయిరో స్పేస్, రక్షణ కంపెనీల టెక్ సపోర్ట్ సేవలను ప్రారంభించాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారికి విజ్ఞప్తి చేశారు.

'చిత్రం... వింగ్స్ ఇండియా-2020 సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి, ఏయిరోస్పేస్, రక్షణ కంపెనీల అధినేతలతో కేటీఆర్