జాతీయ వార్తలు

విదేశీ రాయబారులకు రెడ్ కార్పెటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: జమ్మూ కాశ్మీర్‌కు విదేశీ రాయబారులను తీసుకువెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మన ఎంపీలు, ఆయా పార్టీల నాయకులను ఎందుకు అనుమతించటం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ నిలదీశారు. జయరాం రమేష్ గురువారం ఏఐసీసీలో విలేకరులతో మాట్లాడుతూ మన ఎంపీలు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులను కాశ్మీర్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్న మోదీ ప్రభుత్వం, విదేశీ రాయబారులను అనుమతించటం ద్వారా ఏం సాధించాలనుకుంటోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పదహారు దేశాలకు చెందిన రాయబారులను ఈరోజు కాశ్మీర్ గైడెడ్ టూర్‌కు తీసుకువెళ్లింది, గతంలో కూడా ఇలాంటి గైడెడ్ టూర్‌ను ప్రభుత్వం నిర్వహించటం తెలిసిందేనని ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఒక అంతర్జాతీయ బ్రోకర్ అతను అక్టోబర్ 30న ఐరోపా దేశాలకు చెందిన కొందరు పార్లమెంటు సభ్యులను కాశ్మీర్‌కు తీసుకువెళ్లటం ప్రహసనంగా మారటం తెలిసిందేనని ఆయన ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఎంపీల కాశ్మీర్ పర్యటన అధికారికం కాకపోయినా గురువారం నిర్వహిస్తున్న రాయబారుల కాశ్మీర్ టూర్ అధికారికం, ఇలాంటి టూర్ల ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని జయరాం రమేష్ ప్రశ్నించారు. కాశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసేందుకు మన ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల రాజకీయ నాయకులను అనుమతిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు. కాశ్మీర్‌కు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రాకుండా చూసేందుకే ప్రభుత్వం ఎంపీలు, రాజకీయ నాయకులను కాశ్మీర్‌కు అనుమతించటం లేదని ఆయన ఆరోపించారు. ముగ్గురు మాజీ ముఖ్య మంత్రులు పలువురు ఇతర నాయకులు ఇంకా గృహ నిర్భంధంలో ఉన్నప్పుడు కాశ్మీర్‌లో సామాన్య పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం ఎలా చెబుతుందని జయరాం రమేష్ ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఐచూరి సుప్రీం కోర్టు అనుమతితో కాశ్మీర్‌కు వెళ్లగలిగారనేది మరిచిపోరాదని ఆయన చెప్పారు. ప్రతిపక్షం నాయకుడిని, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిని కాశ్మీర్‌లోకి అనుమతించని ప్రభుత్వం ఇప్పుడు పదహారు దేశాల రాయబారులను ఎలా తీసుకుపోయిందని జయరాం రమేష్ నిలదీశారు. మోదీ ప్రభుత్వం ద్వంద్వ నీతికి ఇది నిదర్శనమని ఆయన విమర్శించారు. కాశ్మీర్‌లో పర్యటించేందుకు అందరికి అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గులాం నబీ ఆజాద్‌తో పాటు ఇతర నాయకులు ఎవ్వరైనా కాశ్మీర్‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పర్యటించేందుకు అనుమతి ఇవ్వవలసిన అవసరం ఉన్నదన్నారు. రాయబారులను అనుమతించే ప్రభుత్వం తమనెందుకు అనుమతించటం లేదు? ప్రభుత్వం ఏం దాచుతోందని జయరాం రమే ష్ అడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా కాశ్మీర్ విషయంలో తప్పు డు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జేఎన్‌యూలో జరిగిన దాడులకు బాధ్యులైన వారిని పోలీసులు ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని జయరాం రమేష్ ప్రశ్నించారు. సంఘటన జరిగి 72 గంటలు పూర్తి కావస్తున్నా, నిందితులను గుర్తించకపోవటం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌ను తొలగించాలంటూ ఆయన పదవిలో కొనసాగినంత కాలం అక్కడ శాంతి నెలకొనదని జయరాం రమేష్ చెప్పారు.