జాతీయ వార్తలు

2020లో ఆరు గ్రహణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జనవరి 9: ఈ సంవత్సరం ఖగోళ శాస్తజ్ఞ్రులు, ఔత్సాహికులు ఆరు గ్రహణాలను వీక్షించనున్నారు. అయితే, వీటిలో మూడు మాత్రమే భారత్‌లో చూడడానికి వీలుంటుంది. ఆరు గ్రహణాల్లో నాలుగు చంద్ర గ్రహణాలు కాగా, రెండు సూర్య గ్రహణాలు ఉంటాయని ఉజ్జయినిలోని జివాజి పరిశోధనా స్థానం సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాష్ గుప్త్ గురువారం ఇక్కడ తెలియజేశారు. అయితే, ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం శుక్ర, శనివారాల్లో ఏర్పడనుందని ఆయన వివరించారు. ఇది భారత్‌లో పాక్షికంగా కనపడుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 10.36 గంటలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం శనివారం తెల్లవారుజామున 2.44 గంటల వరకు ఉంటుంది. జూలై ఐదో తేదీన, నవంబర్ 30వ తేదీల్లో ఏర్పడే చంద్ర గ్రహణం భారత్‌లో వీక్షించడానికి అనువుగా ఉండదు. అలాగే, జూన్ 21 ఏర్పడనున్న సూర్యగ్రహణం మాత్రం భారత్‌లో వీక్షించవచ్చు. కాగా, డిసెంబర్ 14న ఏర్పడబోయే సంపూర్ణ సూర్య గ్రహణం మాత్రం భారత్‌లో వీక్షించడానికి వీలుకాదని గుప్త్ వివరించారు. ఇదిలా ఉంటే 2019లో వచ్చిన గ్రహణాల్లో మూడు సూర్య, రెండు చంద్ర గ్రహణాలను ప్రపంచంలోని పలు దేశాలు వీక్షించాయి.