జాతీయ వార్తలు

ఆంగ్లేయులకు ముందు ‘ఇండియా’నే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: దేశ చరిత్ర గురించి అవగాహన లేకుండా మాట్లాడి వివాదంలో చిక్కుకునే బాలివుడ్ నటుడు సయాఫ్ అలీ ఖాన్ బ్రిటీష్ పాలకులు రాక ముందు ఇండియా అనే భావనే ఉండేది కాదనే అత్యంత వివాదాస్పద ప్రకటన చేసి మరోసారి వివాదం సృష్టించారు. ఢిల్లీ ప్రజలను ఊచకోత కోసిన తైమూర్‌ను సయిఫ్ ఇష్టపడే వాడని, భారత దేశం అంటే ఏమిటో తెలియని వాడంటూ బీజేపీ నేతలతో పాటు పలువురు నెట్‌జనులు సయిఫ్‌పై విరుచుకుపడ్డారు. ఢిల్లీ ప్రజలను ఊచకోత కోసి వారి తలల గుట్టలతో ఉన్న బొమ్మను గీయించుకుని తన కుమారుడి పేరు (తైమూర్) పెట్టుకోవడం వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఏకంగా 17వ శతాబ్దానికి పూర్వం భారత దేశం అనేదే ఉండేది కాదంటూ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. బ్రిటీష్ పాలకులు ఇక్కడికి రాకముందు భారత దేశం అనేదే ఉండేది కాదని వ్యాఖ్యానించిన బాలీవుడ్ హీరో సయిఫ్ అలీ ఖాన్‌పై బీజేపీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి లేఖితోపాటు పలువురు నెట్‌జనులు విరుచుకుపడ్డారు. చరిత్ర గురించి తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదంటూ విమర్శలు గుప్పించారు. మీనాక్షి లేఖితో పాటు కొందరు నెట్‌జనులు ఆయనపై వ్యంగ్య బాణాలు విసురుతూ సయిఫ్ లాంటి చరిత్రకారుడు లేడంటూ ఎత్తిపొడిచారు. సయాఫ్ తన కుమారుడికి తైమూర్ అని నామకరణం చేయడం ద్వారా రెండు సంవత్సరాల క్రితం కూడా విమర్శలకు గురి కావటం తెలిసిందే. 17వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్రియన్ మహా సైనికుడు తనహాజీపై తీసిన చలన చిత్రంలో సెయిఫ్ అలీ ఖాన్ నటించడం తెలిసిందే. ఫిల్మ్ కంపానియన్ అనే చలన చిత్ర పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెయిఫ్ అలీ ఖాన్ ఒక ప్రశ్నకు బదులిస్తూ తన్‌హాజీ జీవిత చరిత్ర నిజమైన చరిత్ర కాదు, బ్రిటీష్ పాలకులు ఇండియా అనే పేరు ఇవ్వనంత వరకు ఇలాంటి భావన అనేదే ఉండేది కాదు అని వ్యాఖ్యానించారు. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ టర్కీ ప్రజలు సైతం తమ దేశానికి చెందిన తైమూర్‌ను అమానుష వ్యక్తిగా భావిస్తారు కానీ కొందరు (సయిఫ్) మాత్రం తన కుమారుడికి తైమూర్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. భారత దేశం చరిత్ర గురించి రవ్వంత కూడా తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదని ఆమె హెచ్చరించారు. భారత దేశం అంటే ఏమిటనేది కూడా తెలియని వారు దేశం గురించి మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. భారత దేశంపై దాడి చేసి వేలాది మందిని ఊచకోత కోసిన టర్కీ నరహంతకుడు తైమూర్ కోర్టు చిత్రకారుడు షరాషుద్దీన్ అలీ యాజ్దీ వేసిన ఒక చిత్రాన్ని మరో నెట్‌జెన్ నెట్‌లో పెట్టారు. తైమూర్ కూర్చున్న సింహాసనం చుట్టు మృత దేహాలుంటే సింహాసనం వెనుక సైన్యం నరికి తెచ్చిన ఢిల్లీ ప్రజల తలల గుట్టలున్నాయి. కొందరు సైనికులు నరికిన తలలు తెచ్చి తైమూర్‌కు అందజేస్తున్నట్లు ఆ చిత్ర పటంలో ఉన్నది. ఒక నెట్‌జెన్ ఈ చిత్ర పటాన్ని ఊటంకిస్తూ ప్రముఖ చరిత్రకారుడైన సయిఫ్ అలీ ఖాన్ ఈ కారణం చేతనే తన కుమారుడికి తైమూర్ అనే పేరుపెట్టుకున్నాడని వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. వేలాది మంది ఢిల్లీ ప్రజల తలలు నరికిన తైమూర్ ఇష్టం కాబట్టే సయిఫ్ తన కుమారుడికి తైమూర్ అనే పేరు పెట్టుకున్నాడని విమర్శించారు. మరో నెట్‌జెన్ దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం చిత్ర పటాన్ని పోస్ట్ చేసి దీనిపై భారత దేశం అని రాసి ఉన్నది చూడంటూ సెయిఫ్ అలీ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. బ్రిటన్ అనేది లేనప్పుడే భారత దేశం ఉన్నదనడానికి నిదర్శనాలు చూపించమంటావా? సయిఫ్ చరిత్రకారుడా అంటూ మరో నెట్‌జెన్ దుయ్యబట్టారు. బ్రిటీష్ పాలకులు ఇక్కడికి రాకముందు ఇండియా ఆనేదే లేదంటూ సయిఫ్ చేసిన ప్రకటన నిజమే ఎందుకంటే ఫ్రాన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు వెళితే వాస్కోడీ గామా ఫిజీ ద్వీపానికి వెళ్లాడని ప్రముఖ జర్నలిస్ట్, పాకిస్తాన్ విమర్శకుడు తరేక్ ఫతేహీ ట్వీట్ చేశారు. పలువురు నెట్‌జనులు అత్యంత పురాతన చిత్ర పటాలను పోస్ట్ చేసి వీటిని చూసైనా భారత దేశం అంటే ఏమిటి? ఎప్పడిది? అనేది తెలుసుకో అంటూ సయిఫ్‌పై మండిపడ్డారు. భారత దేశంపై దాడి చేసి ఇక్కడి ప్రజలను ఊచకోత కోసిన తైమూర్ పేరును తన కుమారుడికి పెట్టుకున్న సయిఫ్‌కు భారత దేశం గురించి తెలిసి ఉంటుందనుకోవడం మన తప్పే అని మరో ట్వీట్ విమర్శలు గుప్పించింది.

'చిత్రం... బాలివుడ్ నటుడు సయాఫ్ అలీ ఖాన్