జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌యూ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలోని నిరుద్యోగంపై నేషనల్ రిజిస్టర్ నిర్వహించాలని యువజన కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చేందుకు జాతీయ స్థాయిలో వినూత్న ప్రచార కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని యువజన కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్‌చార్జి కృష్ణ అల్లావరు, జాతీయ యువజన కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా నిరుద్యోగం పెరిగిపోయిందని వారు ఆరోపించారు. కేంద్రం ఎన్‌ఆర్‌యూ నిర్వహించాలని యూత్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కేంద్రంలో గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన ఉద్యమానికి మద్దతు ఇచ్చే యువత టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉపాధి అవకాశాలు లేక దేశంలోని యువత ఎన్నో కష్టాలు పడుతోందని యూత్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. యువత బాధలు పట్టించుకునే తీరిక, శ్రద్ధ ప్రధాని మోదీకి లేవని వారు ఆరోపించారు. ‘మీరు చెబుతున్న సీఏఏ, ఎన్‌ఆర్‌సీ మాకు అక్కర్లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి కారుకులెవరు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటి అన్నది మాకు కావాలి. యువశక్తి నిర్వీర్యం కాకుండా ఎన్‌ఆర్‌యూ చేపట్టాలి’అని యువజన కాంగ్రెస్ నేత కృష్ణ స్పష్టం చేశారు. దేశంలో రోజుకు 36 మంది నిరుద్యోగులు బలవన్మరణం పొందుతున్నారని ఆయన ఆందోళన చెందారు. 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో మేడ్ ఇన్ ఇండియా పోయి మోదీ మేడ్ తెరమీదకు వచ్చిందని కృష్ణ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని అస్తవ్యవస్తం చేసిందని యూత్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ ఆర్థిక రంగాన్ని కుదేలు చేసిందని అల్లావరు ధ్వజమెత్తారు. గతంలో రైతుల ఆత్మహత్య సంఘటలు జరిగేవని, ఇప్పుడు నిరుద్యోగుల బలవన్మరణాలు మొదలయ్యాయని శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. సూర్య గ్రహణాన్ని చూడడానికి 2.5 లక్షలతో కళ్లజోడు కొనుగోలు చేసిన ప్రధాని మోదీకి నిరుద్యోగంపై దృష్టి సారించే తీరిక లేదని యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ విరుచుకుపడ్డారు.