జాతీయ వార్తలు

మళ్లీ మరోసారి ఎగువసభకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: రాజ్యసభ నుండి రిటైర్ అవుతున్న ముగ్గురు కాంగ్రెస్ నాయకులు టీ సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచందర్‌రావు, మహమ్మద్ అలీ ఖాన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నామరూపాలు లేకుండా పోతే తెలంగాణ నుంచి రాజ్యసభకు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్‌కు అవసరమైన శాసనసభ్యులు లేరు. అందుకే వీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర ష్ట్రాల వైపు చూస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ వైపు వీరు దృష్టి సారించారని అంటున్నారు. సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్ ఆంధ్రప్రదేశ్ నుండి రిటైర్ అవుటే కేవీపీ రామచందర్‌రావు తెలంగాణ నుండి రిటైర్ అవుతున్నారు. తెలంగాణనాయకులు ఆంధ్రాకు, ఆంధ్రా నాయకులు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడాకి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ విభజన. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేవీపీ రామచందర్‌రావును తెలంగాణ కేటాయిస్తే ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డిని ఆంధ్రకు కేటాయించడం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రా నుండి కాంగ్రెస్ నాయకులు రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు ఎలాంటి అవకాశాలు లేవు. ఆందుకే వీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల నుండి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నిక కావాలనుకుంటున్న ఈ ముగ్గురు నాయకులు కాంగ్రెస్ అధినాయకులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభకు మరోసారి ఎన్నిక కావాలనుకుంటున్న ఈ నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నాయకులను కలిసి తమ వాదనలు వినిపిస్తున్నారని అంటున్నారు. రాజ్యసభ టికెట్ ఆశిస్తున్న వీరిలో ఒకరిద్దరు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తమ అభీష్టాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుబ్బిరామిరెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల్లో మంచి మద్దతు ఉండడం తెలిసిందే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు సుబ్బిరామిరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. సుబ్బిరామిరెడ్డి తనకు సన్నిహితంగా ఉండే సీనియర్ కాంగ్రెస్ నాయకుల ద్వారా రాజ్యసభకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి ఎన్నికయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఇక కేవీపీ రామచంద్‌రావుకు మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడనేది జగమెరిగిన సత్యం. దిగ్విజయ్ సింగ్ ఏ మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఒప్పించి రామచందర్‌రావుకు రాజ్యసభ టికెట్ ఇప్పించగలుగుతారనేది ఇప్పుడిప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ కూడా ఈసారి రిటైర్ అవుతున్నారు. ఆయన తన కోసం ప్రయత్నించని పక్షంలో రామచందర్‌రావుకు టికెట్ ఇప్పించేందుకు కృషి చేయవచ్చునని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే ఎంఏ ఖాన్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహమ్మద్ పటేల్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ మద్దతు ఉన్నదనే మాట వినిపిస్తోంది. సోనియా గాంధీకి కూడా ఖాన్ పట్ల సానుభూతి ఉన్నదని అంటున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున పోరాడే సభ్యుల్లో ఎంఏ ఖాన్ ముఖ్యుడు. ఖాన్ లాంటి సభ్యుడు రాజ్యసభలో లేకపోతే కాంగ్రెస్ తరఫున పోడియం వద్ద పోరాటం చేసేవారు కరువైపోతారని కొందరు సీనియర్ నాయకులు చెబుతున్నారు.
కాంగ్రెస్ షౌటింగ్ బ్రిగేడ్ సభ్యుడైన ఖాన్‌కు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుండి రాజ్యసభకు తీసుకురావడం మంచిదని కొందరు సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 9న రిటైర్ అవుతున్న ఈ ముగ్గురు నాయకులు ఇప్పటికి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరికి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందా? అనేది ఆలోచించవలసి ఉంది. వీరిలో ఒకరు రాజ్యసభలో ఉండితీరవలసిందేనని సోనియా గాంధీ భావించే పక్షంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి వీరిలో ఒకరికి రాజ్యసభ టికెట్ లభించే అవకాశాలున్నాయి. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ఎన్నిక కావలసిన వారిని ఎంపిక చేసే ప్రక్రియలో అహమ్మద్ పటేల్ గులాం నబీ ఆజాద్ అత్యంత కీలక పాత్ర నిర్వహిస్తారనేది అందరికీ తెలుసు. వీరి అభిప్రాయాల మేరకే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లవలసిన కాంగ్రెస్ నాయకుల పేర్లను ఖరారు చేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ నుండి ముగ్గురు, రాజస్తాన్ నుండి ముగ్గురు సభ్యులు రిటైర్ అవతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మద్దతు ఇస్తే ఒక కాంగ్రెస్ సభ్యుడు రాజ్యసభకు వచ్చేందుకు అవకాశం ఉంది.
ఇదిలాఉంటే మధ్యప్రదేశ్, కాంగ్రెస్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వం వీరిని కాదని ఏపీ, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులకు ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధపడతారా? అనేది అసలు ప్రశ్న. రాజ్యసన ద్వైపాక్షిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో జారీ అయ్యే అవకాశాలున్నాయి. రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి కే కేశవరావు (టీఆర్‌ఎస్), మహమ్మద్ అలీ ఖాన్, డాక్టర్ టీ సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్), తోట సీతారామలక్ష్మి (టీడీపీ), 2020, ఏప్రిల్ 9 తేదీ రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుండి గరికపాటి మోహన్‌రావు (బీజేపీ), కేవీపీ రామచందర్‌రావు (కాంగ్రెస్) 2020 ఏప్రిల్ 9న రిటైర్ అవుతున్నారు.
''చిత్రాలు.. సుబ్బిరామిరెడ్డి * కేవీపీ *మహమ్మద్ అలీ ఖాన్