జాతీయ వార్తలు

‘కరోనా’ను జయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ప్రాణాంతక వైరస్‌పై తాము చేపట్టిన పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని, ఈ వైరస్ వ్యాధి నియంత్రణకు తమ దేశం అనేక చర్యలు తీసుకుంటోందని భారత్‌లో చైనా రాయబారి సన్ వెల్డాంగ్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి నియంత్రణకు 80 బిలియన్ల ఆర్‌ఎంబీని కేటాయించామని ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింతగా నిధులు సమీకరిస్తామని ఆయన చెప్పారు. ఈ వైరస్ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైన నష్టం వాటిల్లదని పేర్కొన్న ఆయన ‘పర్వతాన్ని అయినా కదిలించగలరేమోగానీ చైనాను కదిలించలేరు. మా ఆర్థిక వ్యవస్థకు ఈ వైరస్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు..’ అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలోనే ఈ వైరస్‌ను అంతం చేయడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నదని వెల్లడించారు. ఈ పోరాటంలో భారత్ తమకు అన్ని విధాలా సహకరిస్తుందంటూ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్‌కు సరిహద్దు అంటూ ఏదీ లేదు కాబట్టి దీని ముప్పు ప్రతి దేశానికి సోకే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వైరస్‌ను సాకుగా చూపించి ఇరు దేశల మధ్య ప్రజల రాకపోకలు, వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ మూల కేంద్రమైన చైనాలోని హూబీలో ఉంటున్న భారతీయులందరికీ తగిన చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. చైనాలో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1860కి చేరుకుంది. అలాగే మరో 72 వేల మందికి ఈ వైరస్ సోకినట్లుగా నిర్ధారించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.
17 ఏళ్ళ క్రితం చైనాలో సార్స్ వైరస్ సంభవించిన నాటి పరిస్థితులను సన్ వెల్డాంగ్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అప్పటి భారత రక్ష మంత్రి జార్జి ఫెర్నాండేజ్ తమకు ఎంతగానో సహకారాన్ని అందించారని తెలిపారు. సార్స్ వైరస్ సమయంలో భారత రక్షణ మంత్రిగా ఫేర్నాండేజ్ చైనాను సందర్శించారని చెప్పారు. సార్స్ వైరస్ గురించి మితిమీరిన స్థాయిలో రాతలు రాసినందుకు విదేశీ మీడియాను ఫేర్నాండేజ్ తీవ్రంగా విమర్శించారని ఆయన అన్నారు.