జాతీయ వార్తలు

ఆగ్రా టూర్‌లో మోదీ ఉండకపోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం జరిపే తాజ్‌మహల్ పర్యటనకు ప్రధాని మోదీ హాజరు కాకపోవచ్చునని అధికార వర్గాలు శనివారంనాడు ఇక్కడ తెలిపాయి. డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న అహ్మదాబాద్ చేరుకుంటారు. ఆయనతోపాటు భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్‌తోపాటు అమెరికా అధికారులు ఎంతోమంది ఉంటారు. అహమ్మదాబాద్‌లో కార్యక్రమం ముగిసిన తర్వాత సోమవారం మధ్యా హ్నం ట్రంప్ బృందం ఆగ్రా వెళ్తుంది. అక్కడ తాజ్‌మహల్‌ను సందర్శించిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటుంది. ట్రంప్ ఆగ్రా పర్యటనలో ప్రధాని మోదీ పాల్గొనే ఆలోచన ఏమీ లేదని అధికార వర్గాలు వివరించాయి. ఈ పర్యటనలో భారత్‌కు చెందిన అధికారులు ఎవరూ పాల్గొనడం లేదని స్పష్టం చేశాయి. ట్రంప్ దంపతులకు స్వాగతం పలికేందుకు ప్రధాని మోదీ సోమవారం అహ్మదాబాద్‌లోనే ఉంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. 25న ఢిల్లీలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో ఇరువురు నేతలు క్రియాశీలకంగా పాల్గొంటారని ఆ వర్గాలు తెలిపాయి.