జాతీయ వార్తలు

ట్రంప్ నోట షోలే మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంలో హిందీ సినిమా పేర్లు దొర్లుతాయంటే ఎవరైనా నమ్ముతారా? సోమవారంనాడు ఇక్కడి మొతెరా స్టేడియంలో చేసిన ప్రసంగంలో భారతీయ సినిమాల గురించి ట్రంప్ మాట్లాడారు. దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే, షోలే సినిమాల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ సినిమాల ద్వారానే భారతీయ సంస్కృతిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. సృజనాత్మక, మేధస్సును మేళవించి దాదాపు 2వేల సినిమాలను భారత్‌లో రూపొందిస్తున్నారని తెలిపారు. బాంగ్రా డ్యాన్సులు, సంగీతం, రొమాన్స్, డ్రామా ఇలా ప్రతీది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందని అన్నారు. తన సినిమా పేరును ట్రంప్ ప్రస్తావించడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని షోలే సినిమా డైరెక్టర్ రమేష్ సిప్పి అన్నారు.