జాతీయ వార్తలు

బలమైన నాయకత్వంతోనే అసాధ్యం సుసాధ్యవౌతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, ఫిబ్రవరి 25: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా అసెంబ్లీని ఉద్దేశించి మంగళవారం ఆయన మాట్లాడారు. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండడం ద్వారానే అసాధ్యమైన పౌరసత్వ సవరణ చట్టం, రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం కావడం వంటి సాధ్యమయ్యాయని దత్తాత్రేయ కొనియాడారు. ‘కేంద్రంలో బలమైన నాయకత్వ మార్గదర్శకత్వంతోనే ఇది సాధ్యమైంది’ అని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా రాష్ట్రంలో 327 పథకాల అమలుకు రెండు వేల 896 కోట్ల రూపాయిలను విడుదల చేసిందని చెప్పారు. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కింద ఈ సంవత్సరం జనవరి 21వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతాంగానికి 597 కోట్ల రూపాయిలను మంజూరు చేసినట్లు గవర్నర్ వివరించారు. 2.76 లక్షల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లను హిమాచల్ గృహిణి సువిధ యోజన పథకం కింద మంజూరు చేసిందన్నారు. లక్షా 90వేల మందికి ఉపాధి లభించే విధంగా గత సంవత్సరం నవంబర్ నెలలో 97వేల 700 కోట్ల రూపాయిల విలువైన 736 ఎంవోయూలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని వివరించారు.