జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా బిహార్ అసెంబ్లీ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఫిబ్రవరి 25: జాతీయ పౌర నమోదు(ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేంగా బిహార్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్)ను 2010 నాటి పాత ఫార్మెట్‌లోనే రాష్ట్రంలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం శాసన సభ సమావేశం కాగానే ఆర్జేడీ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ అంశాన్ని లేవనెత్తాయి. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజావ్యితిరేకమైన మూడింటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు సభ లోపల, బయట ఆందోళనకు దిగారు.