జాతీయ వార్తలు

సీఏఏపై చర్చించ లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించలేదు..’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన ప్రజలకు ఏది మంచిదనేది భారత దేశం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించగలిగే సమర్థత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్నదని, ఆయన గట్టి నాయకుడని, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాశ్మీర్ సమస్యను భారత, పాకిస్తాన్ దేశాలు పరిష్కరించుకుంటాయనే ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. భారత, అమెరికా దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్నారు. వాణిజ్యంతో పాటు పలు కీలక అంశాలపై మోదీతో చర్చలు జరిగాయని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు భారత, పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు తానే సిద్ధమేనని
ఆయన ప్రకటించారు. భారత్‌లో పన్నులు చాలా అధికంగా ఉన్నాయంటూ వాణిజ్య ఒప్పందం ఇప్పుడు కుదరకపోవటానికి ఇదొక కారణమనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. ముస్లింలు, క్రైస్తవులు, మత స్వేచ్చ గురించి మోదీతో చర్చించానని, ముస్లింల విషయంలో ప్రధాని మోదీ ఎంతో శక్తివంతమైన సమాధానం ఇచ్చారని ట్రంప్ తెలిపారు. భారత్ అద్భుతమైన దేశం, ఈ దేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఉన్నదని డొనాల్ట్ ట్రంప్ అన్నారు. ట్రంప్ విలేకరుల సమావేశంలో పలు మార్లు నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తారు, మోదీ అద్భుతమైన నాయకుడంటూ ప్రశంసలు కురిపించారు.
డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం విడిగా జరిపిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం గురించి అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాట వేశారు. ఇది భారత దేశం సమస్య అంటూ ఆయన దాట వేశారు. భారత దేశంలో మత స్వేచ్చ, ఉగ్రవాద సమస్య తదితర పలు అంశాలపై నరేంద్ర మోదీతో విస్తృతంగా చర్చించానని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ మత స్వేచ్చ బాగానే ఉన్నదని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టించాలనే గట్టి పట్టుదలతో మోదీ ఉన్నారని, ఆయన ఈ సమస్యను పరిష్కరించగలుగుతారని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా తనకు మంచి మిత్రుడని, ఉగ్రవాదం సమస్యను పరిష్కరించేందుకు తాను చేయగలిగింది చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తున్న ఉగ్రవాదం సమస్యను ఎలా పరిష్కరిస్తారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇద్దరు ప్రధాన మంత్రులు కృషి చేస్తున్నారు, తాను కూడా చేయగలిగింత సహాయం చేస్తానని బదులిచ్చారు. ఉగ్రవాదం గురించి మోదీతో సుధీర్ఘ చర్చ జరిగిందన్నారు. మోదీ మతపరమైన మనిషి, చాలా ప్రశాంతంగా ఉండే మనిషి, దీనితోపాటు ఆయన చాలా గట్టివాడని ట్రంప్ ప్రశంసించారు. ఉగ్రవాద సమస్యను ఎటువంటి పరిస్థితిలోనైనా నిలువరించవలసిన అవసరం ఉన్నదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ముస్లింలు, క్రైస్తవుల సమస్య గురించి కూడా మోదీతో చర్చించాను, ముస్లింల విషయంలో నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతమైన సమాధానం ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. కొంత కాలం క్రితం 14 మిలియన్లు ఉన్న ముస్లింలు ఇప్పుడు 200 మిలియన్లు అయ్యారని మోదీ తనతో చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.
కాశ్మీర్ సమస్యను రెండు దేశాలు పరిష్కరించుకుంటాయనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని తాను చెప్పలేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాశ్మీర్ పెద్ద సమస్య అని మాత్రమే తానన్నానని ఆయన గుర్తు చేశారు.