జాతీయ వార్తలు

వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మరోసారి బోర్డు పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఇ) అధికారులు తెలిపారు. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులకు వెళ్ళేందుకు అవకాశాలు దెబ్బ తింటాయని వారు తెలిపారు. అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు కారణంగా వార్షిక బోర్డు పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఎస్‌ఇ అధికారులు ఆదివారం చెప్పారు. బోర్డు పరీక్షలకు హాజరుకాని విద్యార్థుల జాబితాలు సిద్ధం చేసి తమకు అందించాల్సిందిగా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను అడిగామని వారు తెలిపారు. 12వ తరగతి విద్యార్థుల పరీక్షలను మరోసారి వాయిదా వేసినట్లయితే, ఆ విద్యార్థులు వైద్య, న్యాయ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3 నుంచి 19 వరకు జేఈఈ (మెయిన్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఈ నెల 7వ తేదీ వరకు పాఠశాలలకు ప్రభుత్వం ఇదివరకే సెలవులు ప్రకటించింది.