జాతీయ వార్తలు

పరిపాలనా సంస్కరణలకు స్టాండింగ్ కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: సమగ్ర పరిపాలనా సంస్కరణల కోసం శాశ్వత స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, పార్టీ పార్లమెంటు సభ్యుడు మనీష్ తివారి సూచించారు. సమగ్ర సంస్కరణలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు మనీష్ తివారి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. సమగ్ర పరిపాలనా సంస్కరణల కోసం పార్లమెంటు స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ సంయుక్త అధ్వర్యంలోనైనా కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.
మిగతా స్టాండింగ్ కమిటీల తరహాలోనే 30 మంది ఎంపీలతో పరిపాలనా సంస్కరణల స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పరిపాలనా సంస్కరణలకు సంబంధించి లోగత వివిధ కమిషన్లు అందజేసిన నివేదికలను పరిశీలించేందుకు ఈ కమిటీకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టాలని ఆయన సూచించారు. దీనికి మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. పరిపాలనా సంస్కరణల కోసం ప్రత్యేకంగా పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.