జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఉగ్రవాద అణచివేత విషయంలో కేంద్ర ప్రభుత్వం నిస్సహన వైఖరిని అనుసరిస్తోందని, ఈ జాఢ్యాన్ని పెంపొందించే వారిని క్షమించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సానుకూల రక్షణ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయగలిగే సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల సరసన భారత్ కూడా స్థానాన్ని సంపాదించుకుందని జాతీయ భద్రతా గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానంతో నిమిత్తం లేకుండా గుణాత్మకమైన రక్షణ విధానాన్ని రూపొందించిందని ఆయన తెలిపారు. ఓ ఏడాదిలో వంద రోజులపాటు సైనికులు తమ కుటుంబ సభ్యులతో గడిపే విధంగా ఓ సానుకూల విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఎంతో కీలక భూమిక నిర్వహిస్తున్నారని పేర్కొన్న ఆయన ప్రపంచంలోని అత్యుత్తమైన దళంగా ఎన్‌ఎస్‌జీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
*చిత్రం...ఎన్‌ఎస్‌జీకి చెందిన 28 ప్రత్యేక గ్రూపుల సముదాయ భవనాన్ని ఆదివారం ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి ఎన్‌ఎస్‌జీ కమాండోలకు ఆయన భోజనం కూడా వడ్డించారు