జాతీయ వార్తలు

సామాన్యుడిపై ‘మోదీ’.. మొసలికన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల బీమా ప్రీమియంలను పెంచడాన్ని, ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గింపు వంటి నిర్ణయాలతో సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇటువంటి ప్రజా వ్యతరేక నిర్ణయాలకు పాల్పడుతూనే.. వారిపై ‘మొసలి కన్నీరు’ కారుస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింగ్వీ ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. ‘ఉపాధి, రూపాయి విలువ పడిపోతున్నాయి.. ప్రభుత్వ అహంకార ధోరణి సహా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది’ అని సింగ్వీ పేర్కొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు 1500 సీసీ లోపు ఫోర్ వీలర్ వాహనాలపై థర్డ్ పార్టీ బీమా ప్రీమీయంను 20 శాతం పెంచుతూ ఆయా కంపెనీల నిర్వాహకులు నిర్ణయాలు తీసుకొంటూ వాటిని అదుపు చేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా టూవీలర్, త్రీవీలర్ వాహనాలపై ప్రీమియం పెంచడం వారిపై విపరీతమైన భారీ పడినట్లవుతుందనీ.. దీనిని ప్రభుత్వం కచ్చితంగా నియంత్రించవచ్చని సింగ్వీ పేర్కొన్నారు. బీమా కంపెనీలను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యా తీసుకోకపోవడం వెనుక కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా బీమా కంపెనీలు ఈ విధంగా థర్డ్ పార్టీ బీమాను 20 శాతం పెంచడం వల్ల నేరుగా సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. సామాన్యుడికి కొనుగోలు శక్తి, భవిష్యత్ ప్రణాళిక అంటూ లేకుండా చేస్తుంటే ప్రభుత్వం ‘మొసలి కన్నీరు’ కారుస్తూ చోద్యం చూడడం శోచనీయమని వ్యాఖ్యానించారు. సామాన్యుడి నడ్డివిరిగేలా చేస్తున్న ఇటువంటి నిర్ణయాలను ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు.

*చిత్రం... కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింగ్వీ