జాతీయ వార్తలు

వైరస్ పరీక్షలకు సీసీఎంబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యుల్లార్ అండ్ మాలిక్యులార్ బయోలాజీ (సీసీఎంబీ)లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెంలగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేసిన విజప్తిని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారు. సీసీఎంబీలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించవచ్చునని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీసీఎంబీలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రధానిని అనుమతి కోరుతానని చెప్పడం తెలిసిందే. సీసీఎంబీలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖ అందగానే నరేంద్ర మోదీ ఇందుకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కోరిన విధంగా సీసీఎంబీలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించటం, వైద్య ఆరోగ్య శాఖ ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వటం జరిగిపోయాయని అంటున్నారు. తాను కోరిన విధంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని కేసీఆర్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించడం గమనార్హం.