జాతీయ వార్తలు

రైళ్లలో కోవిడ్-19 కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ మహమ్మారి బారిన పడొద్దని, ఆ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు పెడచెవిన పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో శనివారం నాడొక ఘటన తీవ్ర కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో క్వారంటైన్ సీల్ ఉన్న ఓ దంపతులు ప్రయాణిస్తున్నారు. భర్త చేతిపై క్వారంటైన్ ముద్ర గమనించిన తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళ చెంది రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలోని కాజీపేట స్టేషన్‌లో బండి ఆగినప్పుడు టీటీఈ దృష్టికి ప్రయాణికులు తీసుకెళ్లారు. అప్రమత్తమైన టీటీఈ దంపతులను పరిశీలించగా భార్య భర్తలు చేతులపై క్వారంటైన్ ముద్ర కనిపించింది. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి అధికారుల ఈ సీల్ వేస్తున్నారు. వెంటనే దంపతులను రైలు దించేసి ఆసుపత్రికి తరలించారు. బోగీని మొత్తం ఖాళీ చేయించి శానిటైజ్ చేశారు. ఏసీ ఆపేసి బోగీని లాక్ చేసేశారు. ఉదయం 9.45కి ఈ ఘటన చోటుచేసుకోగా పరిశీలన పూర్తయిన తరువాత 11.30కు బండి బయలుదేరింది. ప్రయాణికులు సామాజిక దూరం పాటించాలని రైల్వే అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 16న ఇలాంటి సంఘటనే 11055 గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. ముంబయి నుంచి జబల్‌పూర్ వెళ్లే రైలులోని బీ-1 కోచ్‌లో నలుగురు ప్రయాణికులు ఎక్కారు. వారిపై అనుమానం వచ్చి పరీక్షలకు పంపగా కోవిడ్-19 పాజిటీవ్ వచ్చింది. గత వారమే వారంతా దుబాయి నుంచి భారత్ వచ్చినట్టు విచారణలో తేలింది. ఢిల్లీ నుంచి రామగుండం వచ్చే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ మరో ఘటన కలకలం రేపింది. రైలులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిని పరీక్షించగా పాజిటీవ్‌గా తేలింది. ఇలా ఉండగా దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 271కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా 245 రైళ్లను రద్దుచేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.