జాతీయ వార్తలు

కోవిడ్-19 మృతులు ఏడుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (కరోనా) వైరస్ సోకిన సంఖ్య ఆదివారం నాటికి 341కి చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించడంతో ఈ వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో ఒక వ్యక్తి ఈ వైరస్‌తో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా పాట్నాలో 38 ఏళ్ల వయసున్న వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఖతర్ నుంచి ఇటీవల తిరిగివచ్చాడు. ఈ యువకుడు కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మరణించాడు. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు ఆదివారం ముంబయిలో కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. ఇదిలావుండగా, దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 341కి చేరుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ సోకిన ఎక్కువగా వ్యాపించిన రాష్ట్రాల్లో మహారాష్టల్రో 63 మంది మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కేరళ (52), ఢిల్లీ (27), ఉత్తర ప్రదేశ్ (25), రాజస్థాన్ 24, తెలంగాణ (21), కర్నాటక (20), హర్యానా (17), గుజరాత్ (14), పంజాబ్, లడఖ్‌లలో 13 వంతున, తమిళనాడులో (6), చండీగఢ్ (5), మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పశ్చిమ బెంగాల్‌లలో నాలుగేసి వంతున, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మూడు వంతున, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్‌లలో రెండు వంతున, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి వంతున కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.