జాతీయ వార్తలు

75 జిల్లాల్లో లాక్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ప్రపంచాన్ని వణికిస్తున్న అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. భయానక కరోనా వ్యాప్తి చెందకుండా పలు రాష్ట్రాల్లోని 75 జిల్లాల్లో ‘లాక్ డౌన్’ ప్రకటించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తిరిగే అంతర్ రాష్ట్ర బస్సులు, ప్యాసింజర్ రైళ్లు, మెట్రో సర్వీసులను ఈనెల 31వరకు నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా మహమ్మారి మరింత విజృంభించకుండా ఉండేందుకు వీలుగా ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ, అన్ని రాష్ట్రాలకు చెందిన కేబినెట్ కార్యదర్శులు ఈ సమావేశం నిర్వహించి, ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ను ప్రకటించింది. దేశంలో తాజాగా లాక్ డౌన్ ప్రకటించిన 75 జిల్లాల్లో కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేసేందుకు అనుమతించింది. ఈ విషయాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. కేంద్రం రూపొందించిన నిబంధనలను ఆయా రాష్ట్రాలు, జిల్లాల్లో తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎంతో అత్యవసరమైతే తప్ప అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, లేదా ప్రైవేటు వాహనాలను అనుమతించాల్సి ఉంటుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న ఈ తాజా నిబంధనలను ఈనెల 31వరకు పాటించాల్సిందేనని ఆ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా, కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా 14 గంటల పాటు ‘జనతా కర్ఫ్యూ’ చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చిన విషయాన్ని సమావేశంలో పాల్గొన్న ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఈనెలాఖరు వరకు అన్ని సబర్బర్ సర్వీసులు సహా అన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, గూడ్స్ రైళ్లను ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా జూన్ 21వరకు వివిధ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రద్దయిన టికెట్ సొమ్మును చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా, ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రైల్వే శాఖ ఈనెలాఖరు వరకు తీసుకున్న రైళ్లు, సబర్బన్ రైళ్ల రద్దుపై ఎలాంటి అపోహలకు గురికావద్దని ఆ వర్గాలు కోరాయి.