జాతీయ వార్తలు

కరోనా వైరస్ సోకిన వారికి ప్రత్యేక ఆసుపత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అన్ని రాష్ట్రాలూ నిర్ధిష్ట సంఖ్యలో ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయించనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం దేశ ప్రజలు పెద్ద ఎత్తున జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. వైరస్ విజృంభించి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ జనతా కర్ఫ్యూ (లాక్ డౌన్) ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన 75 జిల్లాల్లో పూర్తిగా లాక్‌డౌన్ (జనతా కర్ప్యూ) విధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయని ఆయన తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా ఆసుపత్రులు కేటాయిస్తామని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయని ఆయన చెప్పారు. ఉదాహరణకు ఏయిమ్స్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ ఆసుపత్రి (జజ్జార్, హర్యానా)లో 800 పడకలు కేవలం కోవిడ్-19 రోగుల కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపిందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు 60 ప్రైవేటు ల్యాబ్‌లు రిజిష్టర్ చేసుకున్నాయని ఆయన వివరించారు. కోవిడ్-19 సోకిన వారు ఐదుగురు మృత్యువాత పడ్డారని బలరాం భార్గవ చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ 1,200 కొత్త వెంటలెటిర్లు తెప్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.