జాతీయ వార్తలు

రాష్ట్ర సరిహద్దులు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. జనతా కర్ఫ్యూను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛందంగా ప్రజలు స్వీయనిర్భందంలో ఉన్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ పాటిస్తుండటంతో దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వారం రోజులు పాటు ప్రభుత్వం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా పోలీసు శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి డీజీపీ పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రజలు పోలీసులకు సహకరించి, కరోనా మాహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు పూర్తి మద్దతు తెలపాలని డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

*చిత్రం... హైదరాబాద్‌లో మోటారు సైకిళ్లను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు