జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు పాలించే హక్కులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్బుర్గి (గుల్బర్గా), మే 3: దేశ సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉందని, ఇటీవల కాశ్మీర్ సరిహద్దుల్లో సైనికులు సాహసంతో వైమానిక దాడులను నిర్వహిస్తే, వారిని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. జవాన్ల త్యాగాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌కు పాలించే హక్కుందా అని ఆయన నిలదీశారు. కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. కర్నాటకలోని కల్బుర్గిలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయ గేయం వందేమాతరాన్ని అగౌరవపరిచారన్నారు. కాంగ్రెస్ సకుటుంబ రాజకీయ చిత్రం చూస్తే విశిష్టమైన భారత్
అవతరించేందుకు కృషి చేసిన జాతీయ నాయకులను కాంగ్రెస్ అడుగడుగున అవమానపరిచిందన్నారు. తొలి ప్రధాని నెహ్రూ, కేంద్ర మంత్రి వికె కృష్ణ మీనన్ అవమానపరిచినందుకు అప్పటి సైన్యాధిపతి జనరల్ తిమ్మయ్య రాజీనామా చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు జనరల్ కెఎం కరియప్పను నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ఇద్దరు ఆర్మీచీఫ్‌లు కర్నాటకకు చెందిన వారేనని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం విమోచనకు నిర్ణయం తీసుకుని అమలు చేసిన ఘనత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌దేనన్నారు. హైదరాబాద్ సంస్థానంలో కల్బుర్గి (గుల్బర్గా) భాగంగా ఉండేదన్న విషయాన్ని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెబితే కాంగ్రెస్ పరివారానికి నిద్రపట్టదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ సభలో కాంగ్రెస్‌పై ముప్పేట దాడి చేస్తూ ప్రసంగించారు. మన సైనికులు సరిహద్దుల వద్ద ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, వారి త్యాగనిరతిని ప్రశ్నించే విధంగా, అవమానపరిచే విధంగా కాంగ్రెస్ వ్యవహరించడం , ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. మన జాతీయ హీరోల సాహసానికి ఆధారం కావాలా అని ఆయన కాంగ్రెస్‌ను నిలదీశారు. సర్జికల్ దాడుల తర్వాత మన ఆర్మీ చీఫ్‌ను గ్యాంగ్‌స్టర్ అని కూడా కాంగ్రెస్ సంభోధించిందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం చేపట్టిన విధానాలను ఆయన వివరిస్తూ, పప్పు్ధన్యాలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దళితుల సంక్షేమానికి తాము ఒక్కరే పాటుపడినట్లు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ సందర్భంగా బీదర్‌లో ఒక దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను పట్టించుకోదు, నిందితులపై చర్యలు తీసుకోదు అని ఆయన ఎద్దేవా చేశారు. 1857 నుంచి 1947 వరకు బ్రిటీష్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసి అశువులు బాసిన గిరిజనుల కోసం ఒక స్మారక స్థూపాలను నిర్మించనున్నట్లు నరేంద్రమోదీ పేర్కొన్నారు.
సిద్దు ప్రభుత్వం మొద్దునిద్ర
బళ్ళారి : కర్నాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. విధానసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్ళారిలో గురువారం నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కర్నాటకకు రూ. 9 వేల కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. అయితే ఇందులో కేవలం రూ.37 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. సిద్ధుది రూపాయి ప్రభుత్వమని, కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా ఖర్చు చేయడం లేదని అన్నారు. ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏమిచేయలేక పోయిందని, సమయాన్ని వ్యర్థం చేసిందని ధ్వజమెత్తారు. ఇది రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. రాష్ట్రాంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టకుండా హామీలతో కాలం గడిపారన్నారు. రైతుల జీవనాడి అయిన తుంగభద్ర నదిలో పూడిక తీయాలని రైతులు కోరుతునా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తుంగభద్ర నదిలో పూడిక తొలగిస్తామన్నారు.
చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న విజయనగర సామ్రాజ్యం (హంపీ) అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. హంపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే ప్రక్రియలో భాగంగానే కొత్తగా ముద్రించిన రూ. 50 నోటుపై హంపీలోని రథాన్ని ముద్రించామన్నారు. దక్షిణాది నేతలకు తమ పార్టీ పెద్దపీట వేసిందన్నారు. అందులో భాగంగానే వెంకయ్యనాయుడిని ఉప రాష్టప్రతి పదవిపై కూర్చోబెట్టామన్నారు. వెనుక బడిన వర్గాలు, దళితులకు బీజేపీ పెద్దపీట వేస్తోందన్నారు. బళ్ళారి నగరంలో జీన్స్ తయరీ పరిశ్రమలు కోకొల్లలుగా ఉన్నా వాటిని అభివృద్ది పరచలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఇలాంటి పరిశ్రమలను గుర్తించి వాటి అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు.