జాతీయ వార్తలు

27 మంది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మే 3: బిహార్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతీహరీ ప్రాంతంలో ప్రయాణికుల బస్సు రోడ్డుపై పల్టీ కొట్టింది. వెంటనే బస్సుకు నిప్పు అంటుకుంది. దీంతో 27 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మోతీహరీ జిల్లా చెత్వా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుందని విపత్తుల శాఖ మంత్రి దినేష్ చంద్ర యాదవ్ వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎగసిపడుతున్న మంటల్లోంచే ఎనిమిది మంది ప్రయాణికులు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైవర్ బస్సును మలుపుతిరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు లేచాయని విపత్తుల శాఖ ప్రిన్సిపల్
సెక్రెటరీ ప్రతాయయ అమ్రిత్ తెలిపారు. మృతుల సంఖ్య 32 నుంచి 34 వరకూ ఉండొచ్చని ఆయన వెల్లడించారు. పాట్నాకు 75 కిలోమీటర్ల దూరంలోని కొత్వా పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగిందన్నారు. బస్సు ముజాఫర్‌పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రాష్ట్ర విపత్తుల శాఖ బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.