జాతీయ వార్తలు

ప్రకృతి విలయం..100మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/ఉదయ్‌పూర్, మే 3: ఉత్తర భారతంపై ప్రకృతి కనె్నర్ర జేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి విలయానికి సుమారు 100 మంది మృత్యువాత పడ్డారు. ఇసుక తుపానుకు భారీ వర్షం తోడై బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఉపద్రవానికి వందమంది ప్రాణాలు కోల్పోయారు. గాలి దుమారం, వర్షం విధ్వంసం సృష్టించాయి. ఇళ్లు ఎక్కడికక్కడ నేలమట్టమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రెండు రాష్ట్రాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని దుమ్ము, ధూళితో కూడిన ప్రచండ గాలులకు 64 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు. రాజస్థాన్‌లో 33 మంది మృత్యువాత పడ్డారు. రెండు రాష్ట్రాల్లో కనీసం వంద మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. యూపీలోని ఆగ్రా జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఒక్క జిల్లాలోనే 36మంది చనిపోయారు. 35 మంది గాయపడ్డారు. ఆగ్రా తరువాత బిజ్నోర్, బరేలీ, సహరన్‌పూర్, పిల్‌బిత్, ఫిరోజాబాద్, చిత్రకూట్, ముజాఫర్‌నగర్, రాయ్‌బరేలీ, ఉన్నావో జిల్లాలో వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. గాలులు, భారీ వర్షంతో జన జీవనం స్తంభించింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో 17 మంది మృతి చెందారు. గాయపడ్డవారికి ప్రాధమిక చికిత్స అందించారు. ధోల్‌పూర్‌లో గాయపడ్డ ఒకరిని జైపూర్ ఆసుపత్రికి తరలించారు. సహాయ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికపై జరుగుతున్నాయని, నష్టం వివరాలు అందాల్సి ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి హేమంత్‌కుమార్ గేరా తెలిపారు. పునరావాస పనుల కోసం తక్షణం నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రెండు లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి 60వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. యూపీ, రాజస్థాన్‌లో ప్రకృతి విలయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని రాజస్థాన్ సీఎం వసుంధరరాజే వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, సహాయ కార్యక్రమాలు తక్షణం చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.