జాతీయ వార్తలు

బీజేపీ యాడ్‌లపై ఓ కనే్నయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ‘కోడ్’ ఉల్లంఘిస్తూ విచ్చల విడిగా అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గురువారం ఇక్కడ ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్ నాయకులు అభిశేక్ సింఘ్వీ, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీతో కూడిన బృందం బీజేపీ యాడ్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో ఎన్నికలు జరగనుండగా కమలనాథులు మతం పేరుతో ప్రకటనలు ఇస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఈసీని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.‘బీజేపీ తీరు అత్యంత గర్హనీయం, అభ్యంతరకరం. దీన్ని తీవ్రంగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం’అని సింఘ్వీ వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన తరువాత కాంగ్రెస్ బృందం మీడియాతోమాట్లాడుతూ ‘బీజేపీ తీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కాదు. నేరపూరితమైంది కూడా’అని ఆరోపించారు. క్రిమినల్ చట్టాన్ని ఉల్లంఘించిన కమలనాథులపై కేసు పెడతామని వారు చెప్పారు. బీజేపీ ప్రకటనలపై తక్షణం నిషేధం విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కర్నాటకలో ఓడిపోతామన్న నిరాశతో బీజేపీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇస్తోందని సింఘ్వీ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం సిద్దరామయ్యను క్రిమినల్స్, హంతకులంటూ బీజేపీ నేతలు దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యంతరకర యాడ్‌లపై ఎన్నికల కమిషన్‌కు వారొక వినతిపత్రం ఇచ్చారు. తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.