జాతీయ వార్తలు

మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరద్, మే 3: కర్నాటక ఎన్నికల ప్రచారంలో రోజుకో కొత్త ఒరవడి చోటుచేసుకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు తార స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య ఆరోపణలూ అదే స్థాయిలో సాగాయి. అయతే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఇక్కడో ఎన్నికల సభలో మాట్లాడుతూ నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయబోనని అకస్మాత్తుగా ప్రకటించారు. ప్రధాని మంత్రి పదవి అంటే దేశాధినేత పదవి అందుచేత ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయబోను అని ఆయన చెప్పారు. అయితే కర్నాటకలో మోదీ మాట్లాడిన ప్రతి సభలోనూ తనపై వ్యక్తిగత విమర్శలే చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ‘వివాదాస్పద రాఫెల్ జెట్ విమానాల కొనుగోలుసహా పలు అంశాలపై నేను అడిగే ప్రశ్నలకు మోదీ నుంచి జవాబుల్లేవు’ అని ఆయన అన్నారు. నీరవ్ మోదీ గురించి అడిగితే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ప్రధానిపై ఆయన నిప్పులుచెరిగారు. ‘నేను మాట్లాడిన దాంట్లో తప్పేమిటో చెప్పకుండా ఏకపక్షంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘ఆయన దేశానికే ప్రధాని... అలాంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు చేయబోను. నేను ఈ దేశంలో ఉన్నాను కాబట్టి దేశాధినేత అంటే గౌరవం... అందుకే వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటా’ అని రాహుల్ ఉద్ఘాటించారు. ఈ నెల 12న కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ గబ్బర్‌సింగ్ టాక్స్ అని, మైనింగ్ మాఫియా గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి అవినీతి గురించి మోదీ నీతులు వల్లిస్తున్నారంటూ రాహుల్ సభల్లో తూర్పార బట్టారు. ఒకడుగు ముందుకేసి ‘షోలే’ గ్యాంగ్‌ను బీజేపీ ఎన్నికల్లో నిలబెట్టిందని ఎద్దేవా చేశారు. ఇదేనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం అంటే అని నేరుగా మోదీపైనే రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘రెడ్డీ బ్రదర్స్‌ను అసెంబ్లీలోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నించడం లేదా? సమాధానం చెప్పండి. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు ఉడాయించిన నీరవ్ మోదీ గురించి అడిగితే సమాధానం ఏదీ? రాఫెల్ జెట్‌ఫ్లైట్ల కొనుగోలుపై నోరుమెదపరేం?’ అని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పనపై తాను అడిగిన ప్రశ్నపై ప్రధాని వౌనం దాల్చడం ఎందుకు అని నిలదీశారు. కర్నాటక ఎన్నికలు నరేంద్ర మోదీకో తనకో సంబంధించినవి కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమని రాహుల్ స్పష్టం చేశారు.