జాతీయ వార్తలు

అవరోధాలను అధిగమించి... ‘బేటీ బచావో..’లో హర్యానా, పంజాబ్, రాజస్థాన్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాలికల నిష్పత్తిలో గుణాత్మక మార్పు
* జాతీయ సెమినార్‌లో కేంద్ర మంత్రి మేనక ప్రశంస
న్యూఢిల్లీ, మే 4: ప్రతిష్టాత్మక ‘బేటీ బచావో బేటీ పడావో’ (బీబీబీపీ) పథకం అమలులో హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు అద్భుత ప్రగతి సాధించాయని కేంద్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు. బాలికల నిష్పత్తిలో వెనుకబడివున్న బీహార్, కాశ్మీర్‌లో పథకం ప్రగతి కూడా వెనుకబడే ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై ఢిల్లీలో నిర్వహించిన ఒకరోజు సెమినార్‌లో మంత్రి మేనక మాట్లాడారు. ‘పథకం ప్రారంభించే సమయానికి హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి దారుణాతి దారుణం. పితృస్వామ్య ప్రాంతాలైన పురుషాధిక్య రాష్ట్రాల్లో పథకం ప్రగతి కనిపిస్తుందా? అన్న సందేహాలు ఉండేవి. ఇక హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనైతే ఖాప్ పంచాయితీల కట్టడి మరింత ఎక్కువ. ఇన్ని అవాంతరాలను దాటుకుని చిత్తశుద్ధితో పథకాన్ని అమలుచేసి ఈ మూడు రాష్ట్రాలూ ఉదాత్తస్థాయికి చేరుకున్నాయి’ అని మేనక ప్రశంసించారు. ‘ఒక రాష్ట్రంకాని, ఆ రాష్ట్రంలోని ప్రజలుకాని యుద్ధంలో ఉన్నామన్న భావనతోవుంటే, చుట్టూవున్న వాతావరణం సైతం యుద్ధపూరితంగానే కనిపిస్తుంది. అలాంటి రాష్ట్రంలోని ప్రజలు ఆడపిల్లకు జన్మ నివ్వడానికి సహజంగానే ఇష్టపడరు, భయపడుతుంటారు’ అంటూ పరోక్షంగా కాశ్మీర్‌ను ఉద్దేశించి మంత్రి మేనక వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో బీహార్‌లోనూ వైఫల్యం కనిపిస్తోందని, కేంద్రం కేటాయించిన నిధులు జిల్లాలకు చేరడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. కొన్ని జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్స్ తరచూ బదిలీ కావడం కూడా బీహార్‌లో పథకం విఫలమవ్వడానికి కారణంగా మేనకా గాంధీ విశే్లషించారు. ‘కేంద్రం కేటాయించిన నిధులు జిల్లాలకు చేరలేదు, రాష్ట్రం వద్దే మురిగిపోతున్నాయి. పైగా ప్రతి మూడు నెలలకోసారి జిల్లా మేజిస్ట్రేట్‌లు బదిలీ కావడం కూడా పెద్ద అవాంతరమైంది. పథకం యాజమాన్య నిర్వహణలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది’ అని మేనక ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తున్నా, దేశవ్యాప్తంగా పథకం పూర్తి విజయవంతమైందన్నారు. ‘ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే కృతనిశ్చయంతో ఉన్నాం. దీనికి ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొని, పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రత్నామ్నాయ మార్గాలు అనే్వషిస్తామని వెల్లడించారు.