జాతీయ వార్తలు

రాహుల్ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మే 4: హిందుత్వాన్ని, హిందూ సమాజాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేశారు. సనాతన ధర్మం, హిందువులపై విమర్శలు చేయడం కాంగ్రెస్‌కు ఓ ఫ్యాషన్‌గా మారిందని ఆయన నిప్పులు చెరిగారు. హిందుత్వ ఉగ్రవాది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని అగౌరపరచడమేనని షా అన్నారు. హైదారాబాద్‌లోని మక్కామసీదు పేలుళ్ల కేసులో స్వామీ అసీమానంద్ తదితరులను స్థానిక కోర్టు నిర్దోషులుగా తీర్పునివ్వడాన్ని అమిత్‌షా ఈ సందర్భంగా ప్రస్తావించారు.‘కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు హిందుత్వంపై నిరంతరం విమర్శలు చేస్తునే ఉంటారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను అవమానించడం ద్వారా దేశాన్ని అగౌరపరుస్తున్నారు’ అని బీజేపీ కార్యకర్తల సమావేశంలో ధ్వజమెత్తారు. భోపాల్‌లోని బీహెచ్‌ఈఎల్ దసరామైదాన్‌లో అమిత్‌షా మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలను ఆశించే హిందూ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని హైదారాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించిందని అన్నారు. సమాజంలో వైషమ్యాలు సృష్టించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ చీఫ్ ఆరోపించారు. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ఆయన ప్రకటించారు. ప్రజలను కులం పేరుతో, రాజకీయాల పేరుతో విడదీయాలని కాంగ్రెస్ యత్నిస్తోందని అమిత్‌షా విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి పదవి చేపట్టాక దేశంలో వెనుకబడిన తరగతుల కోసం బిల్లు తీసుకొచ్చారని ఆయన అన్నారు. బిల్లుకు చట్టబద్ధత కల్పించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినా రాజ్యసభలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లోని రాజకుటుంబానికి చెందిన ఎంపీ దాన్ని అడ్డుకున్నారని షా ధ్వజమెత్తారు. మైనారిటీలను బిల్లులో చేర్చాలని మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారని ఆయన వెల్లడించారు. ఇలాంటివాటిని జనంలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ బండారం బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.