జాతీయ వార్తలు

అఫ్గాన్‌లో భారతీయ ఉద్యోగుల అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ కాబూల్, మే 6: ఆఫ్గనిస్తాన్ విద్యుత్ కంపెనీలో పనిచేస్తున్న ఏడుగురు ఉద్యోగులను కొందరు సాయుధులు అపహరించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. వీరిలో ఆరుగురు భారతీయులు. బాగ్లాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆఫ్గాన్ అధికార్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ప్రావెన్షియల్ రాజధాని పుల్-ఇ-ఖోమ్రెకు చెందిన బాగ్-ఇ-షామెల్ గ్రామంలోని కేఈసీ అనే భారతీయ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఏడుగురిని సాయుధులు కొందరు అపహరించారు. వీరిలో ఒకరు అఫ్గాన్ జాతీయుడు కాగా మిగిలినవారు భారతీయులు. ఈ కంపెనీ ఇక్కడ ఒక సబ్-స్టేషన్‌ను కాంట్రాక్ట్‌కు తీసుకుంది. ఇది తాలిబన్ల పనేనని బాగ్లాన్ ప్రావెన్షియల్ కౌన్సిల్ ఆరోపించింది. ఇప్పటివరకు ఈ అపహరణకు తామే బాధ్యులమని ఏ గ్రూపు ప్రకటించలేదు. అఫ్గానిస్తాన్‌లో విద్యుత్ సరఫరాకు సంబంధించి పనిచేస్తున్న అతిపెద్ద భారతీయ కంపెనీల్లో కేఈసీ కూడా ఒకటి.
మా ఉద్యోగులను రక్షించండి
తాలిబన్లు అపహరించిన తమ ఉద్యోగులను కాపాడాలంటూ ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ గోయంకా, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అభ్యర్థించారు. అపహరణకు గురైన ఉద్యోగులు పనిచేస్తున్న కేఈసీ కంపెనీ ఆర్‌పీజీ గ్రూపునకు చెందినది. వౌలిక వసతుల ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు నిర్మాణరంగంలో ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయి దిగ్గజం. కాగా తాము అఫ్గాన్ అధికార్లతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది.