జాతీయ వార్తలు

దళిత వ్యతిరేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ‘దళిత వ్యతిరేకులు’ అంటూ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఫాసిస్టు సిద్ధాంతాలను పుణికి తెచ్చుకున్న వీరు, దళితులు సమాజంలో అట్టడుగునే ఉండిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నేతలు గతంలో చేసిన దళిత వ్యతిరేక ప్రకటనలకు సంబంధించిన వీడీయోలను కూడా ఆయన బయటపెట్టారు. కర్ణాటక ఎన్నికలకు వారం కంటె తక్కువ వ్యవధి ఉన్న తరుణంలో రాజీవ్ గాంధీ ఈ వీడియోలను బయటపెట్టడం, బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. అంతేకాదు, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని రాహుల్ ఆరోపించారు. ‘దళితులు, ఆదివాసీలు సమాజంలో అట్టడుగునే ఉండాలనేది ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ సిద్ధాంతం. ఈ వీడియోలు పరిశీలిస్తే వారిలోని ప్రమాదకరమైన భావజాలం అర్థమవుతుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. రెండు నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోల్లో 2016లో గుజరాత్‌లోని ఉనాలో కొందరు దళితులను దెబ్బలు కొట్టడం, ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్‌ల్లో ఎస్సీ అభ్యర్థుల ఛాతీపై ‘ఎస్సీ’ గుర్తులు వేసిన ఉదంతాలున్నాయి. ‘సబ్‌కా సాత్ అంటూ మోదీజీ ప్రవచిస్తుంటారు. కానీ దేశంలో ప్రతి 12 నిముషాలకు దళితులు వేధింపులకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఆరుగురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు సమర్థించదు? మోదీ బ్రాండ్ అభివృద్ధి అంటే ఇదేనా’ అని వీడియోలో పేర్కొన్నారు. వీటన్నింటిపై మోదీ వౌనం దాల్చడం, ఆయనలోని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మనస్తత్వాన్ని వెల్లడిస్తోందని రాహుల్ విమర్శించారు.