జాతీయ వార్తలు

సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రదుర్గం (కర్నాటక), మే 6: చరిత్రను వక్రీకరించి సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే సుల్తానుల జయంతులు నిర్వహిస్తూ, ప్రజలు పదికాలాలు గుర్తుంచుకునే వీరులను విస్మరించి అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా నవంబర్ 10న టిప్పు సుల్తాన్ (18వ శతాబ్దంలో మైసూర్‌ను పాలించిన రాజు) జయంతి నిర్వహించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించడం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనని విమర్శించారు. ‘కాంగ్రెస్ క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. తరతరాలకు ప్రేరణగా నిలిచే వీర మడకరి, ఒనేకా ఓబవ్వలను విస్మరించింది. ఓట్ల కోసం సుల్తానుల జయంతులను మాత్రం అట్టహాసంగా నిర్వహిస్తోంది’ అని మోదీ ఎద్దేవా చేశారు. చిత్రదుర్గాన్ని పాలించిన చివరి రాజు మడకరి నాయక సేనలోని వీరసైనికుడి భార్య, దళిత మహిళ ఒనేకా ఓబవ్వ గొప్పతనాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 1779లో చిత్రదుర్గాన్ని ఆక్రమించేందుకు టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ ఆలీ సేనలు దాడులకు దిగినపుడు ఒంటి చేత్తో శత్రుసేనను ఎదుర్కొన్న మహిళ ఓబవ్వ అన్నారు. చిత్రదుర్గం కోట బురుజుపై భర్త కావలి కాస్తుంటే, కోట ఆక్రమణకు దొడ్డిదారిన వచ్చిన హైదర్ ఆలీ సైన్యాన్ని మట్టుబెట్టిన ఓబవ్వ వీరత్వాన్ని కాంగ్రెస్ విస్మరించిందన్నారు. కానీ, సుల్తానుల జయంతులను కాంగ్రెస్ ప్రభుత్వం భుజాన వేసుకోవడం వీర దళిత మహిళ ఓబవ్వను అవమానించడమేనని అన్నారు. కర్నాటకలో టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ సామాజిక విభజనకు దారితీస్తుందని చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. బ్రిటీషర్ల చేతిలో మరణించిన సుల్తానులను అనవసరంగా హీరోలను చేసి, కాంగ్రెస్ పార్టీ చరిత్రను వక్రీకరిస్తోందని, సుల్తానుల పాలన ఎంత గొప్పదో కర్నాటక, చిత్రదుర్గం తాత ముత్తాతలకు ఎరుకేనని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత వీరుల ప్రతాపాలను చరిత్రనుంచి తొలగించేందుకు కుట్ర చేస్తూ కర్నాటక గడ్డపై ప్రజల సెంటిమెంట్లను దెబ్బతీస్తోందని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో అనేకమంది గొప్ప గొప్ప వ్యక్తులకు చరిత్రలో స్థానం లేకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని, అబద్దాలను ప్రచారం చేసి దళితులను పక్కదోవ పట్టించడం కాంగ్రెస్‌కు రాజకీయంతో పెట్టిన విద్య అన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి, బీజేపీని గెలిపించాలని ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మోదీ పిలుపునిచ్చారు.