జాతీయ వార్తలు

కాంగ్రెస్ భక్తి రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మే 6: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా భక్తిబాట పట్టారు. వచ్చే ఎడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ఇప్పటినుంచే ప్రచారాలు మొదలుపెట్టిన రాష్టన్రేతలు గుళ్లు, గోపురాలను సందర్శించడం ద్వారా ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న భక్తి సెంటిమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం పని చేయదని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి కాంగ్రెస్ కపట భక్తిని ప్రదర్శిస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రచారాల ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మే 11న మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించి ఉజ్జయిని నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ జ్యోతిరాధిత్య సింథియా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు పార్టీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది వెల్లడించారు. ‘వాస్తవానికి సింథియాకు భక్త్భివమెక్కువ. ఆయన తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు. పధ్నాలుగేళ్లుగా రాష్ట్రానికి పట్టిన బీజేపీ పీడను తొలగించాలంటూ పూజలు నిర్వహిస్తుంటారు’ అని చతుర్వేది అన్నారు. ఇదిలావుంటే మే 1న మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కమల్‌నాథ్, మరుసటి రోజే భోపాల్‌లోని గుఫా మందిరాన్ని సందర్శించడం తెలిసిందే. అదే రోజు ఉజ్జయినిలోని మహంకాళి ఆలయాన్ని సందర్శించడం, దాతియా జిల్లాలోని పీతాంబర పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం తెలిసిందే. ఇదిలావుంటే త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి రానున్న పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సైతం తొలుత మహంకాళి ఆలయాన్నిగాని, పీతాంబర పీఠాన్నిగాని సందర్శించవచ్చని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. గుజరాత్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించే అవకాశం లేకపోలేదని పార్టీశ్రేణులు చెబుతున్నాయి. ఇదిలావుంటే, ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ‘నర్మద పరికర్మ’ పేరిట 3,300 కిలోమీటర్లమేర నదీతీరం వెంబడి పాదయాత్ర నిర్వహించడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆకస్మిక భక్త్భివమంతా ఓటర్లను మోసం చేయడానికి కాంగ్రెస్ వేస్తోన్న ఎత్తుగడలగానే అభివర్ణిస్తోంది. ‘దిగ్విజయ్ ఎవరి పక్షపాతో, కాంగ్రెస్ ఎత్తుగడలు ఎలా ఉంటాయో మధ్యప్రదేశ్ వాసులకు తెలియంది కాదు. కాంగ్రెస్ భక్తి అగచాట్లు ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయవు’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడి శర్మ విమర్శించారు. ‘కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి, మైనారిటీ పక్షపాతి. వాళ్ల ట్రిక్కులు ఎన్నికల్లో ఏమాత్రం వర్కవుట్ కావు’ అని శర్మ వ్యాఖ్యానించారు.