జాతీయ వార్తలు

మేజర్లయితే కలిసి జీవించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: మేజర్లయిన స్ర్తి పురుషులకు వివాహం లేకుండానే కలిసి జీవించే హక్కు ఉన్నదని సుప్రీం కోర్టు పేర్కొంది. వివాహం రద్దయిన కేరళకు చెందిన 20 ఏళ్ల మహిళ తాను ఎవరితో కలిసి జీవించాలో నిర్ణయించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సంబంధాలను సజీవంగా కొనసాగించడాన్ని చట్టం గుర్తిస్తుందని పేర్కొంది. మహిళల గృహహింస రక్షణ చట్టం-2005లో దీనికి సంబంధించిన నిబంధనలున్నాయన్నది. నందకుమార్ అనే వ్యక్తి, తుషారా అనే మహిళతో తనకు జరిగిన వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. చట్టబద్ధమైన వివాహ వయస్సు రాలేదన్న కారణంగా నందకుమార్ వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. నందకుమార్‌కు ఈ ఏడాది మే 30 నాటికి వివాహార్హత వయస్సు 21 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు, వివాహాన్ని రద్దుచేసి, తుషారను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపుతూ తీర్పు చెప్పింది. దీనిపై జస్టిస్ ఎ.కె. సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసం వ్యాఖ్యానిస్తూ, కేవలం 21 ఏళ్లు నిండని కారణంగా వీరి వివాసం చెల్లదని చెప్పడం సమంజసం కాదని పేర్కొంది. ‘నందకుమార్ (అప్పిలెంట్ 1), తుషార హిందువులు. హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం వీరి వివాహం చెల్లకుండా పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరూ మేజర్లు. అందువల్లఈ కేసులో సెక్షన్ 12 నిబంధన వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో వారు వివాహబంధానికి అర్హులు కాకపోతే, కలిసి జీవించవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. వివాహాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన ధర్మాసనం, ‘ఎవరితో కలిసి జీవించాలనే అంశంలో తుషారకు స్వేచ్ఛ ఉంది’ అని స్పష్టం చేసింది. ఇద్దరు మేజర్ల మధ్య జరిగిన వివాహంలో కోర్టు కలుగజేసుకోలేదని కూడా తెలిపింది. అంతేకాదు హెబియస్ కార్పస్ పిటిషన్ కింద ఒక వివాహాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేసింది.