జాతీయ వార్తలు

కొడుక్కి పరీక్ష.. తండ్రికి గుండెపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 6: కొడుకుని నీట్ పరీక్షకు పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తమిళనాడులోని తిరువూర్ జిల్లాకు చెందిన వీలన్‌గుడి గ్రామానికి చెందిన కృష్ణస్వామి తన కుమారుడిని నీట్ పరీక్ష రాయించడానికి కేరళలోని ఎర్నాకులానికి ఆదివారం తీసుకువచ్చాడు. కుమారుడిని పరీక్ష కేంద్రం వద్ద వదిలి వచ్చిన కృష్ణస్వామి లాడ్జికి వచ్చాడు. అక్కడ అతనికి గుండెపోటు రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. తండ్రి మృతి విషయం తెలియని అతని కుమారుడు పరీక్ష రాసిన తర్వాత విషాద వార్త విని విలపించాడు. కృష్ణస్వామి మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి మూడు లక్షలు ప్రకటించారు. అతని కుమారుడి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కృష్ణస్వామి మృతదేహాన్ని తమిళనాడులోని ఆయన స్వగ్రామానికి తరలించేలా చూడాలని తమిళనాడు చీఫ్ సెట్రరీ చేసిన విజ్ఞప్తికి ఎర్నాకుళం కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా ఒక రాష్ట్రం అభ్యర్థికి మరో రాష్ట్రంలో సెంటర్ ఏర్పాటు చేయడమేమిటని నీట్ పరీక్ష నిర్వాహకులను పలువురు తప్పుబట్టారు.

మీ పూర్వీకులను అవమానించకండి
న్యూఢిల్లీ, మే 6: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో, జిన్నా చిత్రాన్ని ఉంచాలని ముస్లిం వర్గాలు కోరడం, ఆయన సిద్ధాంతాన్ని తిరస్కరించిన తమ పూర్వీకులను అవమానించడమేనని కేంద్ర మంత్రి వి.కె.సింగ్ అన్నారు. వీరంతా తమ పూర్వీకుల కారణంగా ఇవ్వాళ భారతీయులుగా ఉన్నారని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జిన్నా చిత్రాన్ని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో, వివాదం రేగింది. దేశ విభజనకు కారకుడైన వ్యక్తి చిత్రం, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలో ఉండటానికి వీల్లేదని బీజేపీ నేతలు కోరుతున్నారు. ‘మీరు ముస్లిం కాకుండా, జిన్నా చిత్రాన్ని ఉంచడానికే మద్దతిస్తున్నట్లయితే, చిత్రాన్ని తొలగించాలని చేస్తున్న డిమాండ్లు మీ స్వేచ్ఛను హరిస్తాయి. మీ మనుషులను దారుణంగా హతమార్చిన వ్యక్తి చిత్రం మీ ఇంట్లో ఉండటాన్ని, మీరు ఎంతవరకు సహించగలుగుతారో ఆలోచించండి. స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి హక్కు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతోమంది గొప్ప వారు తమ రక్తాన్ని ధారబోశారు. మరి మీరు నేడు మీ స్వేచ్ఛను వినియోగించుకుంటున్న తీరుపై వారు ఎంవరకు గర్వపడతారు?’ అని ప్రశ్నించారు. అందువల్ల మన స్వేచ్ఛ ఎవిధమైన ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. ఆయన ఎఎంయు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ, దేశంలో ప్రముఖ యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి. దేశం మీపై ఉంచిన అంచనాలపై జాగరూకత కలిగివుండండి’ అన్నారు.