జాతీయ వార్తలు

ఢిల్లీకి మరో మరక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం కలిగివున్న నగరంలో ఒకటిగా పేరొందిన దేశ రాజధాని ఢిల్లీ ఇప్పడు మరో అపవాదును ముటగట్టుకుంది. దేశంలోనే అత్యధికంగా లైంగిక దాడులు నమోదైన నగరంగా ఢిల్లీ అపఖ్యాతి దక్కించుకొంది. ఈ ఏడాదిలో గత మూడు నెలల్లో ప్రతిరోజూ ఐదుగురు మహిళలు లైంగిక దాడులకు గురయ్యారని ఢిల్లీ పోలీసుల దగ్గర నమోదైన గుణంకాలను బట్టి తెలుస్తోంది. 2017లో ఏప్రిల్ రెండోవారం చివరివరకు 563 లైంగిక దాడులకు సంబంధించిన కేసులు నమోదు కాగా, ఈ ఏడాది అదే సమయానికి 578 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 2017 ఏప్రిల్ రెండో వారానికి మహిళలపై వేధింపులు 944 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ రెండో వారానికి 883 కేసులు నమోదైనట్టు గుణంకాలు తెలియజేస్తున్నాయి.
నమోదవుతున్న కేసులు 96.63శాతం వారికి తెలిసిన వారు, బంధువులు, సమీప వ్యక్తులే ఉంటున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసు అధికారులు స్పందిస్తూ ఫిర్యాదులు అందిన వెంటనే కేసులు సత్వరంగా నమోదు చేయడం వల్ల ఈ కేసుల శాతం పెరిగిందని, గతంతో పోలిస్తే ఇటువంటి కేసులు చాలావరకు తగ్గినట్టు పేర్కొన్నారు. మరోవైపు 2016లో 2064 లైంగిక దాడి కేసులు నమోదుకాగా, 2017లో 2049 కేసులు నమోదయ్యాయి. అలాగే 2016 ఏడాది మొత్తంలో 4035 లైంగిక వేధింపుల కేసుల నమోదుకాగా, 2017 ఏడాదిలో ఈ తరహా కేసులు 3273 నమోదయ్యాయి.
85లక్షల విలువ చేసే 100 ఐఫోన్లు సీజ్
అత్యంత విలువైన 100 ఐఫోన్లను అక్రమంగా రవాణా చేస్తున్న 53 సంవత్సరాల వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఆదివారం ఢిల్లీలో పట్టుకున్నారు. దుబాయి నుంచి భారత్ వచ్చిన వ్యక్తివద్ద 100 సెల్ ఫోన్లు ఉన్నట్టు సమాచారం రావడంతో ఆ వ్యక్తిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ దాదాపు 85 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వాటికి సంబంధించి సరైన సమాచారం, ఆధారాలు చూపని కారణంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దనున్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద ఆ ఫోన్లను సీజ్ చేసి, సెక్షన్ 104 కింద అతన్ని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.