జాతీయ వార్తలు

రాహుల్ గాంధీ మెరుపులు, చెళుకులతో కూడిన విమర్శనాస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్‌కోట్/మాలూరు, మే 7: కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యోక్తులతో ధ్వజమెత్తుతున్న ప్రధాని నరేంద్రమోదీపై ఆపార్టీ అధినేత రాహుల్ గాంధీ మెరుపులు, చెళుకులతో కూడిన విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం ఇక్కడ ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్ వర్క్‌మోడ్‌లేని మొబైల్‌ఫోన్‌గా ప్రధాని మోదీని అభివర్ణించారు. మాట్లాడేందుకు ఇతర అంశాలు ఏమీ లేవుకాబట్టే ప్రధాని తమపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. ‘మొబైల్ ఫోన్లలో మూడు మోడ్స్ ఉంటాయి. వర్క్‌మోడ్.. స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్. మోదీజీ స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్‌నే వాడతారు. వర్క్‌మోడ్ జోలికి అస్సలు వెళ్లరు’అని రాహుల్ ఎద్దేవా చేశారు. మోదీ విదేశీ పర్యటనలనపైనా కాంగ్రెస్ చీఫ్ చతురోక్తులు విసిరారు. మోదీ పనితీరుపై రాహుల్, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడడం ఇదే మొదటి సారికాదు. కాంగ్రెస్ పథకాలకే పేర్లు మార్చి మోదీ ప్రచారం చేసుకుంటున్నారని గతంలో ఆరోపించారు. అలాగే సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తే మోదీ నుంచి సమాధానమే కరవైందని విమర్శించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి పరులకు టిక్కెట్లు ఇచ్చారని మోదీ, బీజేపీ నేతలపై కాంగ్రెస్ విరుచుకుపడ్డారు.దళితుల గురించి మోదీ మాట్లాడరని ఆరోపించారు. రాహుల్, సిద్దరాముయ్య, మల్లిఖార్జున్ ఖర్గేలపై విమర్శలు చేయడమే మోదీకి మా
ట్లాడేందుకు ఎలాంటి విషయాలూ లేవని, దళితుల భద్రత సహా అన్ని అంశాలనూ ఆయన విస్మరిస్తున్నారని అన్నారు. దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు పెచ్చరిల్లుతున్నాయంటూ ఆరోపించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుమతించేది లేదని తెలిపారు. ఇప్పటికే కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే దీనిపై చేసిన డిమాండ్‌ను రాహుల్ ప్రస్తావించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చేతులు జోడించి సమస్కరించే నరేంద్ర మోదీకి ఆయన ఆశయాలు గురించి ఏమాత్రం పట్టదని రాహుల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని చోట్లా దళితులు, మైనారిటీలు తీవ్రస్థాయిలో అణచివేతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్‌‘ఎంతగా ప్రయత్నించినా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మీరు మార్చలేరు’అని అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించిన రాహుల్ ఓ వైపు12వ శతాబ్దం నాటి సామాజిక సంస్కర్త బసవన్న, కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, దేవరాజ్ అర్స్ ఉన్నారని మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, మోదీ ఆలోచనలు ఉన్నాయని రాహుల్ అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్పతోపాటు నలుగురు మాజీ మంత్రులు అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించినవారేనని, అలాగే వివాదాస్పద రెడ్డి బ్రదర్స్ కూడా ఎన్నికల బరిలో దిగారని వీరందరి ఏకైక లక్ష్యం కర్నాటకను దోచుకోవడమేనని, వీరందరి ఏకైక అర్హత దేశంలో అత్యంత అవినీతిపరులు అన్నదేనని ఆయన విమర్శించారు. వీరందరూ రాష్ట్రాన్ని దోచుకుని మోదీనీ మార్కెట్ చేస్తారని ఎద్దేవా చేశారు. రాహుల్ 3 రోజుల పర్యటనలో భాగంగా కోలార్, బెంగళూర్ రూరల్, చిక్‌బల్లాపూర, తుమకూరు జిల్లాల్లో ప్రచారం చేస్తారు.