జాతీయ వార్తలు

కొలీజియంను పిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 10: ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించే అంశం మరో మలుపు తిరిగింది. జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సిఫార్సు చేసేందుకు కొలీజియం సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు బుధవారం రాత్రి లేఖ రాశారు. జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న తన నిర్ణయాన్ని చలమేశ్వర్ తన లేఖలో మరోసారి పునరుద్ఘాటించినట్లు తెలిసింది. జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీం కోర్టు కొలీజియ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఇటీవల తిరస్కరించిన విషయం విదితమే. జస్టిస్ జోసెఫ్ కంటే సీనియర్ న్యాయమూర్తులు ఉన్నందున ఆయనను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించటం సాధ్యం కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేయటం తెలిసిందే. ఉన్నత న్యాయ స్థానంలో కేరళకు సముచిత ప్రాతినిధ్యం ఉన్నందున జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించవలసిన అవసరం ప్రస్తుతానికి లేదన్నది కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కొలీజియం సమావేశం వెంటనే ఏర్పాటు చేసి జస్టిస్ జోసెఫ్ పేరును మరోసారి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ జస్టిస్ చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుప్రీం కోర్టులో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వివాదాస్పదమవుతున్న పరిస్థితుల్లో జూన్ 22 తేదీ పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సును తిరస్కరిస్తూ కేంద్ర న్యాయ శాఖ లేవనెత్తిన అంశాలను కూడా జస్టిస్ చలమేశ్వర్ తన లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ కొలీజియంకు రాసిన లేఖలో జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించకపోవటానికి గల కారణాలను వివరించటం తెలిసిందే. అయితే జస్టిస్ చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన తాజా లేఖలో జస్టిస్ జోసెఫ్ విషయంలో రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించిన అంశాలకు కూడా సమాధానం ఇచ్చినట్లు తలిసింది. జస్టిస్ చలమేశ్వర్ తాజా లేఖ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కొలీజియం సమావేశం ఎప్పుడు చేర్పాటు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ చలమేశ్వర్ డిమాండ్ చేసిన విధంగా దీపక్ మిశ్రా వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేసి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను సుప్రీం కోర్టు నాయయమూర్తిగా నియమించాలనే వినతిని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి పంపిస్తారా లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.