జాతీయ వార్తలు

*తిరుపతి, హైదరాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలకు అవార్డులు లభించాయి. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఏడాది ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను కేంద్ర పట్టాణభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 434 నగరాల, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై నిర్వహించిన ప్రజాభిప్రాయం మేరకు రూపొందించిన జాబితాను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి ప్రకటించారు. దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మొదటి స్థానాన్ని మరోసారి నిలబెట్టుకొంది. ఆ తరువాతి స్థానాల్లో భోపాల్ (మధ్యప్రదేశ్), చండీగఢ్ నిలవగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరంగా తిరుపతి అవార్డును దక్కించుకుంది. ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాష్ట్ర రాజధానిగా గ్రేటర్ హైదరాబాద్‌కు అవార్డు లభించింది. జోన్ స్థాయి అవార్డులలో దక్షిణాది విభాగంలో తెలంగాణలోని మూడు నగరాలకు అవార్డులు లభించాయి. లక్ష జనాభా ఉన్న నగరాలలో ఉత్తమ స్వచ్ఛత నగరంగా సిద్దిపేటకు అవార్డు దక్కింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్న పట్టణంగా బోడుప్పల్, నూతన అవిష్కరణలు ఉత్తమ విధానాల అమలులో పీర్జాదిగూడకు అవార్డులు లభించాయి.