జాతీయ వార్తలు

అగ్నికీలల్లో ఏపీ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: తెలుగు రాష్ట్రాలవారు అత్యధికంగా ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ప్రయాణికుల అప్రమత్తతవల్ల పెనుప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలోని బిర్లానగర్ రైల్వే స్టేషన్ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి సోమవారం ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ (22416) ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు బోగీలు (బీ-7, బీ-6)ల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ రైలు మధ్యప్రదేశ్‌లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ వద్ద సిగ్నల్ కోసం నిలిచింది. అనంతరం రైలుకు సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వడంతో రైలు కదలుతున్న సమయంలో బోగీ-7లో టాయిలెట్‌లో పొగ రావాడాన్ని చిన్న అబ్బాయి గుర్తించి తన తల్లికి చెప్పాడు. ఆమె వెంటనే మిగిలిన ప్రయాణికులకు సమాచారం అదించింది. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు చైనును లాగారు. అప్పటికే కొద్దిపాటి వేగంతో వెళుతున్న రైలును డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. మొదట బోగీ-7లో చిన్నగా మొదలైన మంటలు బోగీ-6కి పాకాయి. ఈ సంఘటనతో ఆ రెండు బోగీలతో ఉన్న ప్రయాణికులు తమకు దొరిగిన సామాగ్రిని తీసుకుని రైలునుంచి దిగిపోయారు. అప్రమత్తమైన మిగతా బోగీల ప్రయాణికులు బోగీలనుంచి బయటకు దిగేశారు. ఈ సంఘటనలో కొందరికి స్వల్పంగా గాయాలైనట్టు అధికారులు చెప్పారు. మిగిలిన బోగీలలో ఉన్నవారిని సహాయక సిబ్బంది కిందకు దింపి రైలును ఖాళీ చేయించారు. నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికి అదుపులోకి రాలేదని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి సకాలంలో గుర్తించి లోకోపైలట్ డ్రైవర్ రైలు ఆపేయడంతో మంటలు ఇతర బోగీలకు విస్తరించలేదు. బోగీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 65 మంది ఉన్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దగ్ధమైన బీ-7, బీ-6 బోగీలను తొలగించి మిగిలిన బోగీలలో ప్రయాణికులను ఎక్కించి మధ్యాహ్నం 3:45 నిమిషాలకు రైలు విశాఖకు బయలు దేరేటట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్‌లు, అధికారులు సురక్షితంగా బయటపడ్డారు.