జాతీయ వార్తలు

రైతులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకే రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 22: రైతుల కష్టాల నుంచి గట్టెంక్కించేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.్ఢల్లీలో ఇండియన్ వుమెన్ ప్రెస్ కార్ప్స్(ఐడబ్ల్యుపీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో కవిత పాల్గొని మహి ళా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తెలంగాణలో రైతులను రుణాలు మాఫి చేసినప్పటికీ పంట కోసం మళ్లీ అప్పులు చేస్తూనే ఉన్నారని చెప్పారు. రైతులు కష్టాలను దృష్టిలో పెట్టుకొనే ప్ర భుత్వం ఈ పథకం తీసుకోచ్చిందని పేర్కొన్నారు.దేశంలో అభివృద్ది చెందాలంటే ప్రభుత్వాలు మార్పిడి కాదని,వ్యవస్థలలో మార్పు రావాలని ఆమె తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ ఏతర పార్టీల కాకుండా వచ్చే ఎ న్నికల్లో ప్రాంతీయ పార్టీల కుటమీ ఫెడరల్ ప్రంట్ కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రకియ కొనసాగుతోందన్నారు. టీఆర్‌ఎస్ బలమైన పార్టీ అని, అందుకే బీజే పీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంట్ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. బీజేపీతో తమ పార్టీ తాము సన్నిహితంగా లేమని, కేవలం ప్రధాని మోదీ ప్రభుత్వంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మాత్ర మే ఉన్నాయని కవిత తేల్చి చెప్పారు. దేశాన్ని మార్చే అవకాశాన్ని ప్రధాని మోదీ జారవిడుచుకున్నారన్న అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి చివరి ఏడాదెనా రైతులకు మేలు చేస్తారేమో చూడాలని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొకుండా పాలసీలు రూపొందించడం సరైనది కాదని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలు అనే భేదాలు వద్దని,అందరం భారతీయులమేనని ఎంపీ కవిత చెప్పారు.