జాతీయ వార్తలు

ఢిల్లీలో ఎమర్జెన్సీ వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: జాతీయ రాజధాని ఢిల్లీలో అత్యవసర పరిస్థితి వాతావరణం నెలకొన్నదని, దీన్ని తొలగించేందుకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తక్షణమే కలుగజేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి కోవింద్ అపాయింట్‌మెంట్ కోరామని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వెల్లడించారు. ‘మొత్తం ఐఏఎస్ అధికార్లు సమ్మెలోకి వెళ్లడంతో ఢిల్లీలో ఎమర్జెనీ వాతావరణాన్ని తలపిస్తోంది. నాలుగు నెలలుగా వీరు సమ్మెలోకి వెళ్లడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి’ అన్నారు. నిజానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మోదీ ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్ అధికార్ల సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తన మంత్రివర్గ సహచరులతో కలిసి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో ప్రస్తుతం ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నిత్యావసరాలను ఇంటి వద్దనే అందజేసే కార్యక్రమానికి అనుమతినివ్వాలని కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కోరుతోంది. మూడు రోజులుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు ధర్నా చేస్తున్నా, కనీసం మూడు నిముషాలు మాట్లాడటానికి కూడా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు సమయం దొరకలేదా? ఆని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఈ సమస్యపై రాష్టప్రతి కలుగ చేసుకోవాలని కోరుతున్నామన్నారు.