జాతీయ వార్తలు

బీసీ కమిషన్ కాలపరిమితి జూలై 31 వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: కేంద్ర ప్రభుత్వంలోని వెనుకబడిన కులాల రిజర్వేషన్లను నాలుగు వర్గాలుగా విభజించే అంశాన్ని అధ్యయనం చేసి తగు సిపారసులు చేసేందుకు ఏర్పాటుచేసిన బీసీ కమిషన్ కాల పరిమితి జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం బీసీ కమిషన్ కాల పరిమితి జూన్ 20తో ముగుస్తుంది. అయితే రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించే అంశంపై కమిషన్ విస్తృత స్థాయి చర్చలు జరిపింది. బీసీ సంఘాల నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, వెనుకబడిన కులాల కమిషన్లు, వివిధ కులాల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నది. ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన వెనుకబడిన జాబితాలోని వివిధ కులాలకు చెందిన విద్యార్థుల వివరాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వివిధ బీసీ కులాల అభ్యర్థుల వివరాలను కమిషన్ సేకరించంది. కేంద్ర పబ్లిక్ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వివిధ బీసీ కులాల ఉద్యోగుల వివరాలను కూడా సేకరించారు. అయితే ఈ వివరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు తమకు మరింత సమయం కావాలని కమిషన్ కోరినందుకే కాల పరిమితిని జూలై 31 వరకు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.