జాతీయ వార్తలు

ప్లాస్టిక్ రహితంగా గోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జూన్ 18: ఈఏడాది చివరినాటికి గోవాను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. అమెరికాలో వైద్య చికిత్సలు పొంది సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. ‘వలసపాలనకు వ్యతిరేకంగా మనం చేసిన పోరాటం అయిపోయిందని నేను భావించడం లేదు. మన ముందు అనేక సమస్యలున్నాయి. వాటిపై పోరాడదాం’ అని ఆయన పిలుపునిచ్చారు. 62 ఏళ్ల పారికర్ అనారోగ్యంపాలై మూడు నెలల పాటు అమెరికాలో చికిత్సపొందారు. గతవారమే రాష్ట్రానికి వచ్చిన ఆయన సోమవారం ఇక్కడ గోవా రివల్యూషన్‌డే సభలో పాల్గొన్నారు. ఆజాద్ మైదాన్‌లో జరిగిన బహిరంగ సభకు గవర్నర్ మృదులా సిన్హా ముఖ్యఅతిధిగా విచ్చేశారు.‘వలస పాలనపై 72 ఏళ్ల క్రితం పోరాటం జరిగింది. దాని ఫలితంగానే గోవాకు విముక్తి లభించింది. 1961లో గోవాకు స్వాతంత్య్రం వచ్చింది. అయితే అంతటితో అయిపోలేదన్నది నా అభిప్రాయం’అని ఆయన స్పష్టం చేశారు. మయెం గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘మయెం గ్రామస్తుల సమస్య కూడా వలస పాలన కిందకే వస్తుంది. కాందీశీకుల ఆస్తుల విముక్తికోసం పోరాడాలి’ అన్నారు. మయెం ప్రజల పక్షాన వ్యక్తిగతంగా పోరాడతానని పారికర్ వెల్లడించారు. ఉత్తర గోవాలోని మయెం గ్రామ జనాభా 30వేలు. అక్కడి ప్రజలు ఇప్పటికీ కాందిశీకులుగానే ఉన్నారు. ఆస్తులు సంక్రమించలేదు. దీంతో ఇప్పటికీ అద్దెకుంటున్నవారిలానే పరిగణిస్తున్నారు. కాగా గోవాను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే తాను అనారోగ్యానికి గురైనందున కాస్త ఆలస్యం చోటుచేసుకుందని ఆయన అన్నారు. గోవాను ప్లాస్టిక్ రహితం చేయడానికి ఇప్పటి నుంచి అన్ని చర్యలూ తీసుకుంటానని ఆయన ప్రకటించారు. చదువున్నవారే ప్లాసిక్ బ్యాగ్‌లు, చెత్తను రోడ్లపైనే వేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేయాలని పారికర్ పిలుపునిచ్చారు.