జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 20: కాశ్మీర్‌లో కాల్పుల విరమణను ఆసరాగా చేసుకుని అనేక మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి చొరబడ్డారని, వీరిని కదలికలను గుర్తించి తుదముట్టిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద సంస్థలకు చెందిన దళాలు చురుకుగా పనిచేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఉగ్రవాదులను ఏరివేస్తామన్నారు. బుధవారం ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రి కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆయన విలేఖర్లతో ముచ్చటిస్తూ జమ్ముకాశ్మీర్‌తో దేశంలో ఎక్కడైనా ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. దేశం నుంచి ఉగ్రవాదులను తరిమిగొట్టేందుకు భద్రతా బలగాలు భారీ ఎత్తున ఆపరేషన్స్‌ను చేపడుతున్నాయన్నారు. కాశ్మీర్‌లో తక్షణమే శాంతిని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దేశంలో అస్థిరత్వం, అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన ఉగ్రవాద తండాలను హెచ్చరించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ధీటైన బదులిచ్చేందుకు భద్రతా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. కాశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వానికి బీజేపి మద్దతును మంగళవారం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గత వారం కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఒక సీనియర్ జర్నలిస్టును, ఒక జవానును పొట్టనబెట్టుకున్నాయన్నారు. సరిహద్దు ఉగ్రవాదం పెచ్చుమీరడంతో బీజేపి గత్యంతరం లేని పరిస్థితుల్లో పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగిన విషయం విదితమే. కాగా కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్ట్ఫా జనరల్ బిపిన్ సింగ్ రావత్ మాట్లాడుతూ ఉగ్రవాదుల ఏరివేత, సరిహద్దుల్లో భద్రత విషయంలో రాజకీయ జోక్యం లేదన్నారు. ఉగ్రవాదుల నిరోధక కార్యకలాపాలకు, కాశ్మీర్‌లో గవర్నర్ పరిపాలనకు సంబంధంలేదన్నారు. రంజాన్ మాసంలో మాత్రమే ఆపరేషన్స్‌ను నిలిపివేశామన్నారు. ‘ ఆర్మీ ఆపరేషన్స్ నిరంతరం కొనసాగుతాయి. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం లేదు’ అని రావత్ తెలిపారు.