జాతీయ వార్తలు

దురదృష్టకరం! : రష్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 20: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల సమితి నుంచి అమెరికా వైదొలగడాన్ని దురదృష్టకరమైన సంఘటనగా రష్యా అభివర్ణించింది. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న అనేకానేక పరిణామాలపై అమెరికా ఏకపక్ష విధానాలను అనురిస్తున్నదనడానికి ఇదో నిదర్శనమని ఒక ప్రకటనలో తెలిపింది. మానవ హక్కులను కాలరాస్తున్న చైనా, క్యూబా, వెనెజులా, కాంగో తదితర దేశాల బాటనే అమెరికా కూడా అనుసరిస్తున్నదని విమర్శించింది. మానవ హక్కుల సమితిని శాసించాలని అమెరికా చూస్తున్నదని, అది సాధ్యం కాకపోవడంతో, ఆరోపణలు చేస్తూ దాని నుంచి వైదొలగిందని పేర్కొంది. అమెరికా చర్య సహేతుకం కాదని స్పష్టం చేసింది.