జాతీయ వార్తలు

పిల్లల అక్రమ రవాణా అరికడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: అమెరికా రాయబారి నిక్కీ హీలీ, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థిని బుధవారం కలుసుకున్నారు. చిన పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో అమెరికా నిబద్ధతతో వ్యవహరిస్తుందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ‘ముక్తి ఆశ్రమ్’లో కైలాస్ సత్యార్థిని కలుసుకున్నారు. చిన్నపిల్లల హక్కులు, మానవహక్కుల గురించి చర్చించినట్టు కైలాస్ సత్యార్థి కార్యాలయం వెల్లడించింది. చిన్నపిల్లలపై నేరారోపణలు చేయడం, ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత క్రూరమైన అంశం. దీనిపై ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ స్పందన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు తగిన సహాయం అందించాలని సత్యార్థి ఆమెను అర్థించారు. చిన్నపిల్లలను రక్షించడం మనందరి బాధ్యత. అందువల్ల చిన్నపిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తామని హెలీ అన్నారు. చిన్నపిల్లల భద్రత, హక్కులపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. మొత్తం మీద హెలీ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 2014లో ఆమె ఇక్కడికి వచ్చారు. అయితే యుఎన్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యాక ఆమె భారత్‌కు రావడం ఇదే ప్రథమం. పంజాబ్ నుంచి అమెరికాకు వలసవెళ్లిన సిక్కు కుటుంబానికి చెందిన ఆమె యుఎస్ అధ్యక్ష యంత్రాంగంలో కేబినెట్ హోదా పొందిన తొలి ఇండియన్-అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.