జాతీయ వార్తలు

వౌనమెందుకు రాహుల్ జీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: తన బావమరిది రాబర్ట్ వాద్రాకు ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన నోటీసులపై, రాహుల్ గాంధీ ఎందుకు పెదవి విప్పడం లేదంటూ బీజేపీ ప్రశ్నించింది. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఎ ప్రభుత్వ హయాంలో విజయ్ మాల్యా, రాబర్ట్ వాద్రాలు అవినీతి, అక్రమాలకు నిదర్శనంగా నిలిచారు. ఇప్పుడు వారికి చట్టం అంటే ఎంటో తెలుస్తోంది. ఒక్కసారి అభద్రతాభావం ఏర్పడింది’ అని బీజేపీ ప్రతినిధి సాంబిత్ పాత్ర ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు.
రాబర్ట్ వాద్రా ఆధీనంలో ఉన్న స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీకి సంబంధించి 2010-11 ఆర్థిక సంవత్సరానికి బకాయిపడిన ఆదాయపు పన్ను మొత్తం రూ.25 కోట్లు చెల్లించాలని, ఆదాయపు పన్నుశాఖ నోటీసు జారీచేసిందన్నారు. మరి అవినీతిని గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఈ నోటీసు జారీపై వౌనంగా ఎందుకుండిపోయారని ఆయన ప్రశ్నించారు.
మాల్యా, వాద్రాలు యుపీఏ అధికారంలో ఉన్నకాలంలో చట్టాన్ని అతిక్రమించి ఒక వెలుగు వెలిగారన్నారు. ‘మాల్యా యుపీఏ హయాంలో రాజులాగా వెలిగినా ఇప్పుడు పోస్టర్ బోయ్‌గా మారాడు’. ‘రుణాలు ఎగ్గొట్టినవారితో తమ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో’ ఇప్పటికైనా గుర్తించండి అని ఆయన అన్నారు.