జాతీయ వార్తలు

కూలిన సుఖోయ్ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్, జూన్ 27: నాసిక్‌కు సమీపంలో ఒక సుఖోయ్ విమానం కూలిపోయింది. అయితే అందులోని ఇద్దరు పైలెట్‌లు ప్యారాచూట్‌ల ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక కారణాల వల్లే ఇది కూలిపోయి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న సుఖోయ్ ఎస్‌యు-30ఎంకెఐ విమానం నాసిక్‌కు 25 కిలోమీటర్ల దూరంలో పరీక్షల నిమిత్తం బుధవారం ఇద్దరు పైలెట్‌లతో వెళ్తుండగా హఠాత్తుగా ద్రాక్షతోటల్లో కూలింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్లు ప్యారాచూట్‌ల ద్వారా కిందకు దూకారు. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ఇద్దరు పైలెట్‌లను పింపల్‌గావ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇలావుండగా 1990లో ఇండియన్ ఎయర్‌ఫోర్సులో ప్రవేశపెట్టిన ఎస్‌యు-30 విమానాలు కనీసం ఆరు వరకు వివిధ సాంకేతిక కారణాలతో కూలిపోయాయి. తర్వాత వాటిని అప్‌గ్రేడ్ చేసి ఎస్‌యు-30ఎంకెఐ పేరుతో అత్యాధునిక ఫీచర్లు జోడించి తయారు చేస్తున్నారు. వీటిని ఇంకా వైమానిక దళానికి అందజేయాల్సి ఉంది. గాలిలో నుంచి గాలిలోకి, గాలిలో నుంచి భూమిపైకి ఆయుధాలు ప్రయోగించి దీనిద్వారా సుదీర్గ లక్ష్యాలను ఛేదించవచ్చు. ఒక్కో విమానం 300 కోట్ల ఖరీదుతో నాసిక్‌లోని హెచ్‌ఏఎల్‌లో తయారవుతున్న ఈ విమానం ప్రయోగదశలో కూలడం గమనార్హం. ఒక్కో విమానం తయారీకి సుమారు మూడేళ్లు పడుతుంది.