జాతీయ వార్తలు

రాష్టప్రతి దంపతులకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఎలాంటి ఫిర్యాదు అందలేదు *పూరీ జగన్నాథ ఆలయ *నిర్వాహకుల స్పష్టీకరణ
భువనేశ్వర్, జూన్ 27: ఈ ఏడాది మార్చిలో రాష్టప్రతి దంపతులు పూరీలోని జగన్నాథ దేవాలయం సందర్శించినప్పుడు వారికి అవమానం జరిగినట్టు తమకు రాష్టప్రతి భవన్ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఒడిశా ప్రభు త్వం, శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జీటీఏ) స్పష్టం చేసింది. ఈఏడాది మార్చి 18న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, అయన భార్య సవిత ఒడిశాలోని జగన్నాథుని దేవాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో కొందరు ఆలయ సేవకులు రాష్టప్రతి దంపతులను తాకేలా నిలబడి వారిని అవమానించారని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభు త్వం, ఆలయ అధికారులు వివరణ ఇస్తూ కొందరు సేవకులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేస్తూ తమకు రాష్టప్రతి భవన్ నుంచి రాతపూర్వకంగా గాని, వౌఖికంగా గాని ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. దీనిపై చీఫ్ సెక్రటరీ ఏపి పథి సైతం మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అయితే ఆలయంలో సేవకుల నుంచి భక్తులకు అమర్యాదకర ప్రవర్తన ఎదురవుతోందన్న ఆరోపణలపై ఎస్‌జీటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పీకే మోహపాత్ర మాట్లాడుతూ అలాంటి ఫిర్యాదులు అందితే వెంటనే దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇలావుండగా, మార్చి 18న రాష్టప్రతి దంపతులకు జరిగిన అవమానంపై మార్చి 20న జరిగిన ఆలయ కమిటీ సమావేశంలో చర్చించారు. ఇదే విషయాన్ని కమిటీ మినిట్స్ పుస్తకంలో సైతం రాశారు. ‘జరిగిన సంఘటనపై రాష్టప్రతి భవన్ అసంతృప్తి వ్యక్తం చేసింది’ అని అందులో పేర్కొన్నారని బీజేడీ అదికార ప్రతినిధి, ఎంపీ పీకే దేబ్ తెలిపారు. ఈ విషయంపై ఇటీవల మీడియాలో వెలుగులోకి రావడంతో దానిపై జిల్లా పోలీస్ యంత్రాంగం, దేవాలయ యంత్రాంగం దర్యాప్తు చేస్తుందని ఆయన చెప్పారు.